పెళ్లి సందడి బ్యూటీకి ఆఫర్ల వెల్లువ.. చేతిలో నాలుగు సినిమాలు

  • IndiaGlitz, [Sunday,January 23 2022]

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మలకు తర్వాత వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి. తాజాగా ఇది మరోసారి రుజువైంది. ఇటీవల 'పెళ్లి సందడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలకు ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటించారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి వసూళ్లు వచ్చాయి.

కొన్ని థియేటర్లలో ఈ సినిమా యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల అందం, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. అలానే దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లో ఆమెకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి హీరోగా 'అనగనగా ఒకరాజు' , వైష్ణవ్ తేజ్ హీరోగా మరో సినిమా తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీ లీలకు అవకాశం దక్కినట్లుగా ఫిలింనగర్ టాక్.

More News

ఆసుపత్రిలో లతా మంగేష్కర్.. ఆటో డ్రైవర్ త్యాగం, ఏం చేశాడంటే..?

దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్(92) కరోనా బారినపడటంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

స్టార్ మా లో 'కామెడీ స్టార్స్ ధమాకా' !!

కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా.. నవ్వించడంలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ స్టార్ మా కామెడీ స్టార్స్ ని కొత్త గా తీర్చి దిద్దింది.

యూత్‌ఫుల్‌గా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో నిండిన సినిమాలు చేస్తూనే వుంటారు యువ హీరో సుధీర్ బాబు.

అన్న రమేశ్ బాబు దశ దిన కర్మకు హాజరైన మహేశ్ బాబు

సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) ఈ నెల 8న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

లగడపాటి విక్రమ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి.