పెళ్లి సందడి రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు...?

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

అప్పటి వరకు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శ్రీకాంత్ కెరీర్ లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి పెద్ద బ్రేక్ తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయట. ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం రోషన్ నిర్మలా కాన్వెంట్ విడుదలకు సిద్ధంగా ఉంది. లవర్ బోయ్ ఇమేజ్ కూడా రాని ఈ కుర్ర హీరో ఇలాంటి తరుణంలో పెళ్లిసందడి వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రీమేక్ లో చేయడం ఎంత వరకు కరెక్టో అని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే కానీ నిజానిజాలు తెలియవు.

More News

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ హీరో...

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ హీరో..ఎవరనుకుంటున్నారా..?యువ కథానాయకుడు సుధీర్ బాబు.

నిర్మాత‌గా మారుతున్న వైష్టో కృష్ణ‌..

పూరి జ‌గ‌న్నాథ్ నిర్మించిన చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ‌ర్క్ చేసిన వైష్టో కృష్ణ ఇప్పుడు నిర్మాత‌గా మారుతున్నారు. పూరి ద‌గ్గ‌ర చాలా సంవ‌త్స‌రాలు వ‌ర్క్ చేసిన కృష్ణ ఆత‌ర్వాత యంగ్  టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసారు.

'బద్రి'కి 16 ఏళ్లు

'బద్రి' ఈ పేరు చెబితే మ‌న‌కు మూడు విష‌యాలు గుర్తుకు వ‌స్తాయి. అందులో మొద‌టిది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రెండోది డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఇక మూడోది నువ్వు నందా అయితే, నేను బ‌ద్రి, బ‌ద్రినాథ్ అయితే ఏంటి..?

బాలయ్య సెంచరీ సినిమా ప్రారంభోత్సవం కు భారీ ఏర్పాట్లు..

నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమాను ఉగాది రోజున అమరావతిలో ప్రకటించిన విషయం తెలిసిందే.గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

స‌రైనోడు ర‌న్ టైమ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. బ‌న్ని స‌ర‌స‌న కేధ‌రిన్, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించారు.