అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ తో 'పెళ్ళికి ముందు ప్రేమకధ'

  • IndiaGlitz, [Thursday,March 16 2017]

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "పెళ్ళికిముందు ప్రేమ కధ"."రాజుగారి గది" ఫేమ్ చేతన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ చెప్పారు. నేటితరం యువత జీవితంలో చాలా కీలకమైన పెళ్లి అనే ఘట్టానికి ఇస్తున్న ప్రాముఖ్యత, ఆ కారణంగా వారి జీవితాల్లో తలెత్తుతున్న సమస్యల నేపధ్యంలో విజ్ణానానికి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా డి.ఎస్ రావు మాట్లాడుతూ.. "నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేటితరానికి మంచి మెసేజ్ తోపాటు ఎంటర్ టైన్మెంట్ ను అందించే సినిమా "పెళ్ళికి ముందు ప్రేమకథ". తాగుబోతు రమేష్, సత్య, శివ ప్రసాద్, రాకేష్ ల కాంబిణేషన్ లో తెరకెక్కిన కామెడీ సీన్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఈ నెల ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నాము, హీరో హీరొయిన్ కెమిస్ట్రీ ఈ పెళ్ళికి ముందు ప్రేమ కధ లో బాగా వర్క్అవుట్ అయ్యింది. ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తున్నాం" అన్నారు.
రాజు గారి గది" ఫేం చేతన్ శీను, సునైన హీరోహీరొయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, అశ్విని, డా.శివ ప్రసాద్, రాకేశ్, రచ్చ రవి, గౌతమి, మాస్టర్ శివ కృష్ణ, గంగాధర్, బాష , ఆర్.పి,కీర్తి నాయుడు, శ్రీ ప్రియ, యార్లగడ్డ కిరణ్, నాగేంద్ర కుమార్ తదితరలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఫోటోగ్రఫి : పి.సి. కన్నా, స్క్రీన్ ప్లే: సుధాకర్ పట్నం, రచన-దర్శకత్వం: మధు గోపు, నిర్మాతలు: డి.ఎస్.కె-సుధాకర్ పట్నం, అవినాష్ సాలండ్ర!

More News

ఆయుష్మాన్ భవ లోగో లాంచ్!!

దర్శకుడు మారుతి సమర్పణలో యువకథానాయకుడు చరణ్ తేజ్ హీరోగా,దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్

'బాహుబలి 2' ట్రైలర్ రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా,సత్యరాజ్,రమ్యకృష్ణ,నాజర్ ప్రధాన తారాగాణంగా కె.రాఘవేంద్రరావు

దర్శకరత్న దాసరి నారాయణరావుకు అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానోత్సవం!!

గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగయ్యా గారి పేరిట కళా పీఠీం జీతాయ పురస్కారం కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది.

'రిజర్వేషన్' పోస్టర్ మరియు టీజర్ రిలీజ్

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. "డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్"తో కలిసి.. స్వీయ రచన మరియు దర్శకత్వంలో డాక్టర్ శివానంద యాలాల తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం "రిజర్వేషన్". తెలుగులో "రిజర్వేషన్" పేరుతొ రిలీజ్ కానున్న ఈ చిత్రం..

250 థియేటర్లలో 'మెట్రో' విడుదల

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`. రజని తాళ్లూరి నిర్మాత.