శివసేన మేనిఫెస్టోకు జనాలు ఫిదా.. ఓట్ల సంగతేంటో!

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా... 24న ఫలితాలు రానున్నాయి. టైమ్ తక్కువగా ఉండటంతో... అధికార బీజేపీ, శివసేన వేగంగా పావులు కదుపుతున్నాయి. 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈసారి బీజేపీ 144 సీట్లలో పోటీ చేయనుండగా.. శివసేన 126 స్థానాల్లో బరిలో దిగనుంది. మిగతా 18 స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీచేయనున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో శివసేన మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టోకు మహారాష్ట్రీయులు ఫిదా అయిపోయారు. అయితే ఓట్లు ఏ మాత్రం రాలుతాయో అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అనుమానం.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

ఒక్క రూపాయికే వైద్య పరీక్షలు, పేదలకు అందుబాటులో వైద్యం.

రాష్ట్రవ్యాప్తంగా 1000 భోజనాలయాలు, వాటిలో రూ.10కే భోజనం

300 యూనిట్ల వరకు విద్యుత్ వాడకంపై 30 శాతం రాయితీ

మరాఠీలో 80 శాతం పైగా మార్కులు తెచ్చుకున్న 10, ప్లస్ టూ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

రైతులకు ఏటా రూ.10 వేలు నగదు బదిలీ

యువతకు రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కాలేజీల వరకు ప్రత్యేక బస్సులు

రైతులకు ఐదేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరల్లో ఎలాంటి మార్పులుండవ్.. ఇప్పుడున్న ధరలనే వచ్చే ఎన్నికల వరకు కొనసాగింపు

మొత్తానికి విద్య, వైద్యం, వ్యవసాయానికి శివసేన తన మేనిఫెస్టోలో పెద్ద పీఠ వేసిందని చెప్పుకోవచ్చు. మరి వీటిని జనాలు ఏ మాత్రం నమ్ముతారో..? ఏ మాత్రం ఓట్ల వర్షం కురిపిస్తారో తెలియాలంటే ఫలితాలు వెలువడేనాటి వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

చంద్రబాబు.. శోభన్ బాబా?.. మందు అలవాటైందేమో!?

కేవలం నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక చట్టాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని..

రెండో షెడ్యూల్‌లో 'ఒరేయ్‌.. బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా 'ఊల్లాల.. ఊల్లాల' మోషన్ పోస్టర్

సీనియర్ నటుడు, విలన్ పాత్రలతో ఆకట్టుకొన్న సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ఊల్లాల ఊల్లాల.

చిరుకు కేసీఆర్ ఊహించని గిఫ్ట్..!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చేశారు.

ఆర్టీసీని ప్రైవేటీకరించం.. సెలవులే సెలవులు!!

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమణకు ససేమిరా అంటుండగా..