అసభ్యకరమైన మెసేజ్‌లతో హీరోయిన్‌ను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్


Send us your feedback to audioarticles@vaarta.com


ఎక్కడికి పోతావు చిన్నవాడా, శ్రీనివాస కల్యాణం, ప్రేమకథా చిత్రమ్ 2 వంటి పలు తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నందితా శ్వేత. ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ నందితా శ్వేత బిజీగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నందితా శ్వేతను అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలు పెట్టాడు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారానే వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వాంజి సెలియన్ అనే వ్యక్తి నందితను అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలు పెట్టాడట. ఈ విషయాన్ని చెబుతూ నందిత `అలాంటి వారికి కుటుంబం ఉండదా?` అని ప్రశ్నించింది. ఈ వ్యక్తిపై తనకు పోలీసులకు కంప్లైంట్ చేసే ఆలోచన లేదని కూడా చెప్పింది. అయితే సదరు వ్యక్తి ఇదే పంథాను కొనసాగిస్తే మాత్రం ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడలాగానే ఉంది. ప్రస్తుతం నందితా శ్వేత తమిళంలో తానా, తెలుగులో అక్షర సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments