close
Choose your channels

పిక్ టాక్ : కొండనైనా పండి చేసే కండలు.. యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీ వైరల్!

Tuesday, June 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తన హార్డ్ వర్క్ తో యంగ్ హీరో నాగశౌర్య యువతలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద లాంటి సెన్సిబుల్ కథల్లో నటిస్తూనే ఛలో, అశ్వద్ధామ లాంటి కమర్షియల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. సినిమా కోసం తనని తాను మార్చుకోవడం కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాడు నాగశౌర్య.

నాగశౌర్య ప్రస్తుతం లక్ష్య, వరుడు కావలెను లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాల కోసం నాగశౌర్య సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. లక్ష్య ఫస్ట్ లుక్ లో నాగశౌర్య పొడవైన జుట్టు, గడ్డం, సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా వరుడు కావలెను చిత్రంలో కూడా శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ మైంటైన్ చేయనున్నాడు.

నాగశౌర్య కండలు తిరిగిన బాడీతో జిమ్ లో కసరత్తులు చేస్తున్న లుక్ బయటకు వచ్చింది. ఈ పిక్ లో శౌర్య స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్ష్య చిత్రం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకవరుడు కావలెను చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకురాలు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.