మార్చి 17న 'పిచ్చిగా నచ్చావ్'

  • IndiaGlitz, [Wednesday,March 15 2017]

సంజీవ్ చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...
నిర్మాత క‌మల్‌కుమార్ పెండెం మాట్లాడుతూ - ''ఈ సినిమా కోసం ఒక సంవ‌త్స‌రంగా టీం అంద‌రూ క‌ల‌సి ఒక ఫ్యామిలీలా ట్రావెల్ అవుతున్నాం. ఎక్క‌డా ఇబ్బందులు లేకుండా సినిమాను అనుకున‌న్ స‌మ‌యంలో పూర్తి చేశాం. మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళాయి. సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది'' అన్నారు.
ద‌ర్శ‌కుడు వి.శ‌శిభూష‌ణ్ మాట్లాడుతూ - ''క‌థ విన‌గానే నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చారు. సినిమాను కృష్ణాజిల్లాలో 46 రోజులు పాటు ఏక‌ధాటిగా చిత్రీక‌రించాం. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. దాదాపు కొత్త‌వాళ్ళ‌తో చేసిన సినిమా. క‌థ‌లో హీరోయిన్ ఉండ‌దు. క‌థ వ‌ల్ల హీరోయిన్ క్రియేట్ అవుతుంది. ఒక‌రిని న‌మ్మితే వారి కోసం ఎంత దూరం అయినా వెళ‌తాం. 108 థియేట‌ర్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అచ్చ తెలుగు స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌. మార్చి 17న సినిమా రిలీజ్ అవుతుంది'' అన్నారు.
పుచ్చా రామ‌కృష్ణ మాట్లాడుతూ - ''నిర్మాత క‌మల్‌కుమార్‌గారు, ద‌ర్శ‌కుడు శ‌శిభూష‌ణ్, నేను ఈ సినిమా కోసం ముందు నుండి ట్రావెల్ చేస్తూ వ‌స్తున్నాం. దర్శ‌కుడు శ‌శిభూష‌ణ్ మ‌దిలో వ‌చ్చిన చ‌క్క‌ని ఆలోచ‌నే 'పిచ్చిగా న‌చ్చావ్‌'. నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను ఎక్క‌గా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూసిన వారంద‌రూ దీన్ని భారీ బ‌డ్జెట్ మూవీ అనుకుంటున్నారు. సినిమా చూసి సురేష్ ప్రొడ‌క్ష‌న్ వంటి సంస్థ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్ప‌డం ఆనందంగా ఉంది. మార్చి 17న సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల అవుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

More News

ఆకట్టుకుంటున్న డోర ఆడియో!

ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు.

ఫైనల్ షెడ్యూల్ లో 'బెలూన్'

జై,అంజలి,జనని అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెలుగు,తమిళంలో రూపొందుతోన్నహార్రర్ థ్రిల్లర్ 'బెలూన్'.

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సుమంత్ హీరోగా చిత్రం ప్రారంభం

సుమంత్,ఆకాంక్ష సింఘ్ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం హైద్రాబాద్ లో

'కన్నుల్లో నీ రూపమే' ట్రైలర్ లాంఛ్

ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగా నూతన దర్శకుడు బిక్స్ తెరకెక్కించిన సినిమా కన్నుల్లో నీ రూపమే.

'నగరం' ను సక్సెస్ చేసన ఆడియెన్స్ థాంక్స్ : రెజీనా

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా,రెజీనా కథానాయికగా అశ్వనికుమార్ సహదేవ్ సమర్పణలో