'పిల్ల రాక్షసి' సెన్సార్ పూర్తి...నవంబర్ 4న విడుదల

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

'బిచ్చగాడు' వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి అందిస్తున్న మరో చిత్రం 'పిల్ల రాక్షసి'. మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన 'ఆన్ మ‌రియ క‌లిప్పిలాను' తెలుగులో 'పిల్ల రాక్షసి' పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. 'బిచ్చ‌గాడు' చిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ఆ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన ర‌చ‌యిత భాషా శ్రీ పిల్లా రాక్ష‌సి సినిమాకు మాటలు, పాట‌లు అందించారు.

'బిచ్చగాడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవ‌ల లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దర్శ‌కుడు మిథున్ మాన్యూల్ థామ‌స్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను రియ‌లిస్టిక్‌ పంథాలో ఆవిష్క‌రించారు. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో పాటు, మ్యాజిక్‌ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా ఉంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు. 'ఓకే బంగారం' ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా, సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది. స‌న్ని వాయ్‌నే, లియోనా లిషాయ్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ స‌భ్యులు సినిమా బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

పుకార్ల పై క్లారిటి ఇచ్చిన కొర‌టాల‌..!

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్...చిత్రాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. నాలుగ‌వ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఉక్రెయిన్ లో విన్న‌ర్..!

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం విన్న‌ర్.ఈ చిత్రాన్ని  ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై   బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ జ‌గ‌దేక‌వీరుడు కి డైరెక్ట‌ర్ దొరికాడు..!

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

భర్త కోసం రంభ కోర్టులో పిటిషన్..!

తన అందం అభినయంతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార రంభ.

దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సూర్య‌..!

త‌మిళ హీరో కార్తి కాష్మోరా సినిమాతో దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి...సూర్య దీపావ‌ళికి రావ‌డం ఏమిటి అనుకుంటున్నారా..?