close
Choose your channels

రానా, రాజ్ తరుణ్ కాంబోలో మల్టీస్టారర్

Tuesday, January 7, 2020 • తెలుగు Comments

రానా, రాజ్ తరుణ్ కాంబోలో మల్టీస్టారర్

టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దగ్గుబాటి రానా, రాజ్ తరుణ్ ఓ రిమేక్ సినిమా చేయబోతున్నారట. ఈ మల్టీ స్టారర్.. ఓ హిందీ సినిమాకు రిమేక్ అని టాక్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘సోనో కే టీటూ కీ స్వీటీ’ సినిమాలో ఇద్దరూ నటించనున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఓ యువతి ఎంట్రీతో ఆ ప్రయాణం ఎంత వరకు దారి తీసిందనే స్టోరీ లైన్‌తో ఈ సినిమా నడుస్తుంది. కామెడీ బాగా పండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్.. రీసెంట్‌గా విడుదలైన ‘ఇద్దరి లోకం ఒకటే సినిమా’ ఆశించినంతగా రాణించకపోవడంతో.. కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయం ఇది. దీంతో రానాతో కలిసి వస్తుందనే ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ తెలుగు రీమేక్‌ని సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రానా సొంత సంస్థలో నిర్మితమవుతున్న ఈ సినిమాను ‘అలా ఎలా’ ఫేమ్ అనీశ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అనీశ్ గతంలో రాజ్ తరుణ్ హీరోగా ‘లవర్’ అనే సినిమా చేశాడు. ప్ర‌స్తుతం రానా హ‌థీ మేరే సాథీ స‌హా ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తుంటే రాజ్ త‌రుణ్ మాత్రం కొత్త సినిమాల క‌థ‌లు వింటున్నాడు. రాజ్‌త‌రుణ్ రీసెంట్ మూవీ ఇద్ద‌రి లోకం ఒక‌టే ప్లాప్ కావ‌డంతో సినిమాల ఎంపిక‌లో త‌ను ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz