close
Choose your channels

క‌రోనా వైర‌స్‌కు అస‌లైన ఆయుధం ప్లాస్మా:  చిరంజీవి

Saturday, August 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌రోనా వైర‌స్‌కు అస‌లైన ఆయుధం ప్లాస్మా:  చిరంజీవి

‘‘ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే క‌రోనా వైర‌స్ బారి నుండి బ‌య‌ట‌ప‌డిన వారియ‌ర్స్ ప్లాస్మాను దానం చేస్తే క‌రోనా బారిన ప‌డిన వారిని కాపాడొచ్చు. ప్లాస్మా దాన‌మే క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టే ఆయుధం’’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పోలీసుల‌కు అగ్ర క‌థానాయ‌కులైన చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్ వంటి వారు కూడా త‌మ వంతు స‌పోర్ట్‌ను అందించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మ‌రో అడుగు ముందుకేసి సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ సీపీ సజ్జ‌నార్‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఇర‌వై రెండేళ్ల క్రితం ర‌క్తం స‌రిగా అంద‌క ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే బ్ల‌డ్ బ్యాంక్ ద్వారా నాకు వీలైన మేర సాయం అందించాను. దానికి నాకు కేంద్ర ప్ర‌భుత్వం అవార్డు కూడా ఇచ్చింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్లాస్మా దానం చేయ‌డం అనేది చాలా ముఖ్యం. ప్లాస్మా వారియ‌ర్స్ ముందుకు వ‌చ్చి దానం చేస్తే క‌రోనా బాధితుల‌ను కాపాడ‌వ‌చ్చు. ఇటీవ‌ల నా స‌మీప బంధువు ఒక‌రు కోవిడ్ బారిన ప‌డితే నాకు తెలిసిన స్వామి నాయుడుని ప్లాస్మా దానం చేయ‌మ‌ని కోరాను. అత‌ను ప్లాస్మా దానం చేయ‌డంతో మా బంధువు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. నా ఇంట్లో ప‌నిచేసే వంట మ‌నిషికి, స్విమ్మింగ్ ల‌క్ష్మ‌ణ్ స‌హా మ‌రో ఇద్ద‌రికి క‌రోనా వ‌చ్చింది. వారంద‌రూ క‌రోనా నుండి బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ పనిలో చేరారు. ఇప్పుడు వారు కూడా ప్లాస్మా దానం చేస్తున్నారు’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.