అమ్మ పాత్రలో చేయడమే డ్రీమ్ రోల్ అంటుంది...

  • IndiaGlitz, [Sunday,December 18 2016]

త‌మిళ ప్ర‌జ‌ల అమ్మ‌గా, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా జ‌య‌ల‌లిత‌కు ఉన్న క్రేజే వేరు. ఉన్న‌ట్టుండి జ‌య అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో జాయిన్ కావ‌డం, నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య జ‌య‌ల‌లిత మ‌ర‌ణించ‌డం జ‌రిగింది. జ‌య‌ల‌లిత, శ‌శిక‌ళ ప్రాణ స్నేహితుల‌నే సంగ‌తి అందిరికీ తెలిసిందే. జ‌య మ‌ర‌ణంపై శ‌శిక‌ళ ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌లేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ తాను శ‌శిక‌ళ పేరుతో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అల్రెడి క‌న్న‌డ‌లో జ‌య‌ల‌లిత‌పై ఓ సినిమా కూడా రూపొందుతోంది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత కొంత రీషూట్ కూడా చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తే బావుంటుంద‌ని ఓ ఫ్యాన్..మ‌ద‌ర్ అనే పేరుతో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌డం పెద్ద వార్తైంది. ఈ సంద‌ర్భంలో ర‌మ్య‌కృష్ణ ఈ విష‌యంపై నోరు విప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఏ డ్రీమ్ రోల్ లేద‌ని, అయితే జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించ‌డ‌మే త‌న డ్రీమ్‌రోల‌ని, ఎవ‌రైనా మంచి స్క్రిప్ట్‌తో వ‌స్తే తాను న‌టించ‌డానికి సిద్ధ‌మేన‌ని కూడా ర‌మ్య‌కృష్ణ పెర్కొన‌డం విశేషం. మ‌రో విష‌య‌మేమంటే హీరోయిన్ త్రిష కూడా జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతుంది. ఒక‌వేళ నిజంగానే ఎవ‌రైనా జ‌య‌ల‌లిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తే ర‌మ్య‌కృష్ణ‌, త్రిష‌ల్లో జ‌యల‌లిత‌గా ఎవ‌రు న‌టిస్తారో చూడాలి....

More News

పవన్ పై కేసునమోదు...

ప్రజల దేశభక్తిని నిరూపించుకునేందుకు సినిమా హాళ్లు పరీక్షా కేంద్రాలైయ్యాయంటూ రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

నాగ్ ఎన్ కన్వెన్షన్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..!

టాలీవుడ్ హీరో నాగార్జున చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను కట్టారని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

'పిట్టగోడ' వంటి డిఫరెంట్ ఎంటర్ టైనర్ కు మ్యూజిక్ చేయడం హ్యాపీ - ప్రాణం కమలాకర్

విశ్వదేవ్ రాచకొండ,పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్,సన్ షైన్ సినిమాస్ పతాకాలపై

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు..!

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు,మహేష్ బాబు,మంజుల,సుధీర్ బాబు...ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే.

పరభాషా నటీనటులకు మనం స్వాగతం చెబుతాం.. వాళ్లు మాత్రం మనకి అవకాశాలు ఇవ్వరు.. కారణంఅదే..! రావు రమేష్

విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని అనతికాలంలోనే సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు రావు రమేష్.