అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ

కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో అష్ట దిగ్బంధనం ఆంక్షలు ముగిసినప్పటికీ, కరోనా వైరస్ కథ ఇంకా ముగిసిపోలేదన్నారు. ఈ సమయంలో టెస్టింగ్ ఒక్కటే అతి శక్తివంతమైన ఆయుధమన్నారు. కరోనా మహమ్మారిపై గొప్ప విజయం సాధించామని వెల్లడించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ కరోనాతో మనం పోరాడుతూనే ఉండాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మనమే చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.

అమెరికా, యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులో మొదట్లో తగ్గినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారన్నారు. జీవితాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్న.. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోందని, వ్యాక్సిన్ పరిశోధన అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందన్నారు. కాగా మన దేశంలో కరోనా రికవరీ రేటు బాగుందని మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.

పండుగ వేళ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా కట్టడిలో భారత్‌.. అగ్రదేశాల కంటే ముందుందన్నారు. దేశంలో 90 లక్షలకు పైగా కోవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 2 వేల ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మోదీ వెల్లడించారు.
కరోనా కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇది పండగల సమయం.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్‌ ధరించకుండా బయటికి వస్తే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టినట్లేనన్నారు. కరోనాపై విజయం సాధిస్తున్నామని.. అలసత్వం పనికి రాదన్నారు. వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు శ్రమిస్తున్నాయన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.

More News

తెలంగాణకు విరాళం ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు..

భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతికి బెదిరింపు

అసలు మనుషులు ఏమైపోతున్నారు.. మానవత్వం కనపడటం లేదేంటి?

'నర్తనశాల' బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన  పౌరాణిక చిత్రం `న‌ర్త‌న‌శాల`.

రూ. కోటి చొప్పున ప్రకటించిన చిరు, మహేష్

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భారీగా స్పందిస్తోంది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలుస్తోంది.

రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించిన నాగ్, ఎన్టీఆర్..

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కదిలింది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలిచింది.