కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని

కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10శాతమని.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం అందిస్తామని భరోసానిచ్చారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని మోదీ చెప్పారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందన్నారు.

అందర్నీ కలుపుకొని పోయేలా..

‘భారత ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయీ శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగ్గట్లుగా నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ ప్రత్యేక ప్యాకేజీ దోహదం చేస్తుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రేపటి నుంచి ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అందిస్తారు. ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుంది. సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుంది. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటాం. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుంది. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారింది’ అని జాతినుద్ధేశించి ప్రసంగంలో మోదీ చెప్పుకొచ్చారు.

More News

జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 8 గంటలకు మాట్లాడిన ఆయన.. ప్రాణాలు కాపాడుకుంటూ

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168 రిలీజ్ డేట్‌!!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం

ప్రేయ‌సి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన రానా!!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఈరోజు త‌న స్నేహితుల‌కు, అభిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఇంత‌కూ రానా ఇచ్చిన షాకేంటో తెలుసా? ఓ అమ్మాయితో దిగిన ఫొటోను షేర్ చేసిన రానా ఆమె ఓకే చెప్పింది

ప‌వ‌న్ 28లో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌..?

త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌టంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా శ‌ర‌వేగంగా సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు.

ఈసారి 'రాములో రాముల..' అంటోన్న డేవిడ్ వార్నర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.