దేశం పెను సవాల్‌ ఎదుర్కొంటోంది.. అందరూ ఇలా చేయండి!

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ఘ ప్రసంగం చేసిన ఆయన దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాకుండా కరోనా విషయంపై కూడా ఆయన మాట్లాడారు. ‘ప్రపంచాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తోంది. కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచింది. కరోనా వైరస్‌ కారణంగా దేశం పెను సవాల్‌ను ఎదుర్కొంటోంది. కరోనాపై పోరులో దేశ ప్రజలు సంఘటితం కావాలి. సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అమోఘం. నిన్నటి దివ్వెల కార్యక్రమం మన ఐకమత్యాన్ని చాటింది. కరోనాపై పోరులో మన సంకల్పాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రశంసించింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.

ఇలా చేయండి..!

‘గతంలో యుద్ధాల సమయాల్లో కేంద్రానికి విరాళాలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి యుద్ధం కంటే తక్కువేమీ కాదు. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలి. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా బీజేపీ కార్యకర్తలు సాయం చేయాలి. కరోనాపై యుద్ధంలో మనం విజయం సాధించాలి. కరోనాపై అప్రమత్తత కోసం కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను తెచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్‌ సోకినవారు మన చుట్టూ ఉంటే యాప్‌ సమాచారం ఇస్తుంది’ అని మోదీ ఈ సందర్భంగా కార్యకర్తలకు నిశితంగా వివరించారు.

ప్రపంచానికి ఇది ఉదాహరణ

‘నిన్న రాత్రి 9 గంటలకు 130 కోట్ల మంది ఐక్యతను చూశాం. కరోనాపై జరుగుతున్న పోరాటంపై అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు తమ ఐక్యతను చాటారు. భారత్‌లాంటి అతి పెద్ద దేశంలో లాక్‌డౌన్‌ను ఇంతటి క్రమశిక్షణతో పాటిస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచానికి భారత్‌ ఉదాహరణగా నిలిచింది. ఈ వైరస్‌ తీవ్రత గురించి ముందుగానే అర్థం చేసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, శక్తి మేరకు అమలు చేస్తోంది’ అని మోదీ అభినందించారు.

More News

కరోనాను జయించిన కనికా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకుంది. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించింది.

కోవిడ్ 19 ప్ర‌భావం.. మురికివాడ‌లో పేద‌ల‌కు ర‌కుల్ సాయం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు రోజువారీ కూలీలు, కార్మికుల‌కు చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ప‌వ‌న్ 27లో అనుష్క‌..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న

గ్యాప్‌లో.. ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడేం చేస్తున్నాడంటే..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్

'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు.