ప్రపంచమంతా తెలుగు సినిమావైపే.. టాలీవుడ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని ప్రపంచం అనుకునేది. కానీ హిందీ పరిశ్రమే కాదు.. భారత్‌లో మరెన్నో ఇండస్ట్రీలు వున్నాయని బాహుబలి వంటి సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా టాలీవుడ్ గమనాన్నే మార్చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బాహుబలి తర్వాత, బాహుబలికి ముందు అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. ఇప్పుడు దేశమంతా తెలుగు సినిమా వైపే చూస్తోంది. ఇక్కడ రిలీజ్ అవుతోన్న సినిమాలను బాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమలు రిమేక్‌గా చేసుకుంటున్నాయి. అంతేకాదు .. మన హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు పరభాషా డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇతర భాషల్లోని స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం కనీసం తెలుగులో ఒక్క సినిమా అయినా చేయాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయమైన హీరోలు సైతం స్ట్రెయిట్‌గా టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ గొప్పతనంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గడించిందని ప్రశంసించారు. సిల్వర్‌ స్క్రీన్‌ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మోడీ అన్నారు. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందన్నారు. తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోందని.. రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామ పురస్కారం వరించిందని మోడీ గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ ఖ్యాతిని గడిస్తోందని ప్రధాని అన్నారు.

అంతకుముందు హైద‌రాబాద్ శివారు ప్రాంత‌మైన ముచ్చింత‌ల్ చిన్నజీయ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో స‌మ‌తా మూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని మోడీ ఆవిష్క‌రించారు. వెయ్యేళ్ల క్రితమే మూఢాచారాల‌ను రూపుమాప‌డానికి శ్రీరామానుజాచార్యులు ఎంత‌గానో కృషి చేశార‌ని ప్రధాని ప్రశంసించారు. ఆయ‌న బోధ‌న‌లు ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శ‌క‌మ‌న్నారు.

More News

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

దిగ్గజ నేపథ్య గాయని, భారతరత్న లత మంగేష్కర్ కన్నుమూశారు.  ఆమె వయసు 92 సంవత్సరాలు.

స్టార్ మా పరివార్ లీగ్

స్టార్ మా ప్రేక్షకుల ఆదివారాన్ని మరింత ఉత్సాహంగా మార్చిన షో "స్టార్ మా పరివార్ లీగ్" రెండు విజయవంతమైన సీజన్స్ పూర్తి చేసుకుని మూడో సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది.

216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ.. రామానుజులపై ప్రశంసలు

ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది.

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

కరోనా బారినపడిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్‌ కాండీ

FIR మూవీ రఫ్ కట్ చూసి ర‌వితేజ‌ గారు షూర్ షాట్ హిట్ అన్నారు - హీరో విష్ణు విశాల్

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్