close
Choose your channels

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు

Monday, March 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా మార్చి 11కు వాయిదా పడింది. చిత్రం విడుద‌లైన మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

1990వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోత సహా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 1990లలో హిందూ పండిట్స్‌పై అప్పటి వరకు వారితో కలిసి మెలిసి తిరిగిన వేరే మతానికి చెందిన ఈ మారణకాండకు తెగబడ్డారు. హత్యలతో పాటు వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్వదేశంలోనే శరణార్ధులుగా మారారు. ఈ సంఘటనల ఆధారంగానే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ను తెరకెక్కించారు వివేక్. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న నేపథ్యంలో నిర్మాత అగ‌ర్వాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రీ, త‌న భార్య ప‌ల్ల‌వి జోషిలు ప్ర‌ధాని మోడీని క‌లిసారు. ఆ సందర్భంగా ఆయన సినిమాను, చిత్ర బృందాన్ని ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా మోడీని నిర్మాత అభిషేక్ అగర్వాల్ శాలువాతో సత్కరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.