PM Modi Photo: అమ్మా నిర్మలమ్మ .. ఇవిగో 'మోడీజీ ఫోటోలు', కానీ ప్లేసే మారింది

గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ - టీఆర్ఎస్ మధ్య ఉప్పూనిప్పుగా పరిస్ధితి వున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలు చేస్తుండటం, బీజేపీ, ప్రధాని మోడీపై విమర్శల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత వుందంటూ వార్తలు బయటకు రావడం, బండి సంజయ్, రాజాసింగ్‌ల అరెస్ట్‌లతో .. బీజేపీ- టీఆర్ఎస్‌లు ఇక తాడోపేడో తేల్చుకోవాలన్నంత స్థాయిలో తలపడుతున్నాయి.

టీఆర్ఎస్- బీజేపీల మధ్య గ్యాప్ పెంచిన నిర్మలా సీతారామన్:

ఇలాంటి పరిస్ధితుల్లో తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్నికి ఆజ్యం పోశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన నిర్మలమ్మ.. ఓ రేషన్ షాపు పరిశీలనకు వెళ్లి ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి టీఆర్ఎస్ నేతల నుంచి అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది.

అమ్మా నిర్మలమ్మా ఇదిగో మోడీ ఫోటో:

అయితే నిర్మల చేసిన హడావుడితో ప్రధాని మోడీ ఫోటోలు వెలిశాయి. కానీ రేషన్ దుకాణం వద్ద కాదు.. మరో చోట ప్రత్యక్షమయ్యాయి. అది కూడా ఎక్కడో కాదు. ఎల్పీజీ సిలిండర్ల మీద. వినియోగదారులకు డెలివరీ చేసేందుకు సిలిండర్ల లోడ్‌తో ఓ ఆటో వెళ్తోంది. దాని నిండా సిలిండర్లు వున్నాయి. వాటికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు అతికించి వున్నాయి. అంతేకాదు.. ‘‘మోడీ జీ రూ.1105’’ అని రాసి వుంది. ఈ ఫోటోలను నెటిజన్లు, టీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ‘‘అమ్మా నిర్మలమ్మ మోడీ ఫోటో చూసుకో అమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More News

Lucky Laxman: 'లక్కీ లక్ష్మణ్‘ చిత్రంలోని “ఓ మేరీ జాన్” సాంగ్ డైరెక్టర్ చందు మొండేటి చేతుల మీదుగా విడుదల

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో

Mirnaa: మిర్నా మీనన్ కథానాయికగా 'ఉగ్రం'

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రెండో చిత్రంగా 'ఉగ్రం' తెరకెక్కుతోంది.

Gandipet Park: భాగ్యనగరానికి మరో మణిహారం.. ప్రారంభానికి సిద్ధమైన ‘గండిపేట పార్క్’, ప్రత్యేకతలెన్నో..!!

హైదరాబాద్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట.. కానీ కాలక్రమంలో మరిన్ని ఆధునిక హంగులు నగరానికి సమకూరాయి.

Janasena : జనసేన జెండా చూస్తేనే వైసీపీ వణుకుతోంది.. దిమ్మెలు ధ్వంసం చేస్తే ఆగుతామా: నాదెండ్ల మనోహర్

విజయవాడలో జనసేన జెండా దిమ్మెలు ధ్వంసమైన ఘటనపై స్పందించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర 'అందాల నటుడు'

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు