close
Choose your channels

మహేష్ ' పోకిరి' కి పదేళ్లు...

Thursday, April 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ...వాడే పండుగాడు ఈ డైలాగ్ ఇప్పటికి ఫేమసే మరి. పూరి పెన్ నుండి వచ్చిన ఈ డైలాగ్ కు మహేష్ స్టైలిష్ యాడ్ కావడంతో అలా నిలిచిపోయిందని చెప్పాలి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కొన్ని రోజుల వరకు ఈ డైలాగ్ ను వల్లేశారు మరి..అంతలా ఎఫెక్ట్ చూపించిన చిత్రమే పోకిరి.

నిజం చెప్పాలంటే ఓ రకంగా మహేష్ కు మాస్ ఇమేజ్ ను, తిరుగులేని స్టార్ డమ్ ను తీసుకొచ్చిన చిత్రమిది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను .. వంటి డైలాగ్ తో పాటు సినిమాలో చాలా డైలాగ్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. హీరోలను మాస్ స్టయిల్ లో డిఫరెంట్ గా చూపించే పూరి జగన్నాథ్, మహేష్ కొత్త స్టైయిల్ లో ప్రజెంట్ చేశాడు. అండర్ కవర్ పోలీసుగా మహేష్ నటన సూపర్బ్. దీంతో పాటు ఇలియానా అందం, మణిశర్మ సంగీతం, బ్రహ్మానందం, ఆలీ కామెడి ట్రాక్, షాయాజీ షిండే, నాజర్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి నటన ప్రతిదీ సినిమాకు హైలైట్ అంశంగా పరిగణించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాసే సినిమాగా నిలిచిపోయింది. 2006, ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రానికి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.