YS Jagan: ఇది జగన్ దక్షత : పోలవరం పనుల కదలిక వెనుక అంతా తానై .. సాకారం కానున్న 100 ఏళ్ల స్వప్నం

  • IndiaGlitz, [Wednesday,June 07 2023]

పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఉరకలెత్తే గోదావరి వృధాగా సముద్రం పాలవుతూ వుండటంతో ఆ నదీ జలాలను ఒడిసిపట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేశారు. కానీ.. 80 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పోలవరం పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగలేదు. అంతేకాదు.. ఆధునిక భారతదేశంలో ఎన్నో పథకాలకు శంకుస్థాపనలు పలుమార్లు జరిగాయి. అంటే ఒకసారి శంకుస్థాపన జరిగిన దానికి మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేయడం. ఈ ఘనత పోలవరానికి కూడా దక్కింది. కానీ దశాబ్ధాల పాటు పోలవరం నిర్మాణం పూర్తవుతుందా లేదా అన్న ప్రశ్న ఈ ప్రాంత వాసులను వేధించింది. ఈ క్రమంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం నిర్మాణానికి గట్టిగా కృషి చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాల్వల నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేశారు. ఈ కృషికి కేంద్రం సైతం కదిలి వచ్చింది.

పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చంద్రబాబు :

ఇక రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ఏపీకి జీవనాడిగా అభివర్ణించారు నిపుణులు. రాష్ట్ర సాగు, తాగు నీటి సమస్యలకు , పారిశ్రామిక అవసరాలకు పోలవరం ఒక్కటే పరిష్కారం చూపగలదని వారు తెలిపారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఒక ఏటీఎంలాగా మార్చుకున్నారు. తొలుత దానిని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి.. తామే నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం పోలవరాన్ని తామే నిర్మించుకుంటామని చెప్పి ప్రజలను మోసం చేశారు. అంచనా వ్యయం పెంచేసి దోపిడీ కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందించలేదు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి హడావుడి చేశారే గానీ అనుకున్న సమయానికి నీరు ఇవ్వలేక చేతులెత్తేశారు.

పట్టిసీమకి ఇంపార్టెన్స్, అటకపైకి పోలవరం :

అక్కడితో ఆగలేదు చంద్రబాబు అండ్ కో. పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌కు సమీపంలో చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేయడం పెద్ద దెబ్బగా నీరుపాదల నిపుణులు అంటారు. పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా పట్టిసీమను ఆగమేఘాల మీద పూర్తి చేశారు. పోలవరంను పూర్తి చేయాలని చంద్రబాబుకు ఏ కోశాన లేదు, అందుకే మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నప్పటికీ పట్టించుకోలేదు. పట్టిసీమ కోసం ఖర్చు చేసిన డబ్బు.. పోలవరంలో సగభాగం పూర్తి అయ్యేదని నిపుణులు అంటున్నారు. పట్టిసీమ వల్ల 70 టీఎంసీల నీరు కృష్ణా జిల్లాకు వెళ్తుందని అంచనా, అదే పోలవరం పూర్తయితే 80 టీఎంసీల నీరు వెళ్తుంది. పట్టిసీమ పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం .. ప్రజాధనం లూటీ చేసింది.

జగన్ మంత్రాంగం.. ఇక నిధుల వరదే :

2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. రివర్స్ టెండరింగ్ ‌ ద్వారా దుబారా ఖర్చులను నివారించిన ఆయన.. ప్రాజెక్ట్ తీరు తెన్నులను మార్చేశారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం , నిధుల విడుదల గురించి విజ్ఞప్తి చేశారు. ఆయన వాదనతో ఏకీభవించిన కేంద్రం నిధుల విడుదలకు అంగీకరించింది. 2013-14 ధరల అంచనా ప్రకారం రావాల్సింది రూ. 1249 కోట్లేనని.. కానీ జగన్ తన సమర్థతతో కేంద్రం నుంచి రూ. 12,911 కోట్లు సాధించారు. అంతేకాదు.. మరో రూ.10,000 కోట్లు అడగ్గా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. ఈ పరిణామాలతో పోలవరం పనులు పరుగులు పెడతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే :

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షలు, కృష్ణ జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.
పోలవరం నుంచి విశాఖపట్నం వరకు 182 కిలోమీటర్ల ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు
172 కిలోమీటర్లు పొడవున్న కుడి కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీటి వసతి
పోలవరం రిజర్వాయర్ లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశం
ఈ ప్రాజెక్ట్ ద్వారా 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు
మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించే అవకాశం
బాబు జగజ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 3 జిల్లాలకు, 3 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి.

More News

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించారా.. లేదా, ఆ సంతకాలు ఎందుకు చేశారు: జగన్‌‌పై నాదెండ్ల ప్రశ్నల వర్షం

పోలవరం ప్రాజెక్ట్ జగన్ పాపపు పథకంగా మారిందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన నాదెండ్ల.. రూట్ మ్యాప్ ఇది, ప్రతి చోటా జనవాణి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి

వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు.

జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను

Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.