close
Choose your channels

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Friday, August 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ప్రముఖ సింగర్ సునీత పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సునీత మేనల్లుడినని చెప్పి చైతన్య అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సునీత ఇటీవల ఓ వీడియోను కూడా విడుదల చేశారు. చైతన్య తన మేనల్లుడినని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడని ఆమె వెల్లడించారు. ఇది తెలిసి తాను షాక్ అయ్యానని.. తనకసలు చైతన్య అనే మేనల్లుడే లేడని ఆమె వెల్లడించారు.

అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందన్నారు. దయచేసి ఇలా మోసపోవద్దన్నారు. సెలబ్రిటీకి చుట్టాలనగానే ఎలా డబ్బులిస్తారు? కొంచెమైనా ఆలోచించరా? అంటూ ఆమె మండిపడ్డారు. చైతన్యను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. ఎవరెవరి నుంచి ఎంత డబ్బు సేకరించాడు? తదితర వివరాలన్నింటినీ అతని వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.