close
Choose your channels

నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కంప్లైంట్.. అర్థరాత్రి న్యూసెన్స్, ఇంట్లో గొడవ!

Thursday, August 5, 2021 • తెలుగు Comments

మెగా డాటర్ కొణిదెల నిహారిక గత ఏడాది వ్యాపారవేత్త చైతన్యని పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా మంచి గుర్తింపే అందుకుంది.

ఇదీ చదవండి: ఆచార్య అప్డేట్: చిరు, చరణ్ పిక్ చూశారా, ఇక రెండు సాంగ్స్ మాత్రమే!

ప్రస్తుతం నిహారిక మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది. తన భర్త చైతన్యతో కలసి ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వెకేషన్స్ కి వెళ్లినా, బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నా ఆ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా నిహారిక ఫ్యామిలీ తాజాగా వార్తల్లో కెక్కింది. అనూహ్యంగా ఆమె భర్తపై వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిహారిక ఫ్యామిలీలో ఎం జరుగుతుందో తెలియదు కానీ.. వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతోందట. ఆమె భర్త చైతన్య అర్థరాత్రి న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ లో ఉంటున్న వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే చైతన్య కూడా బంజారాహిల్స్ పోలీసులకు అపార్ట్మెంట్ లో ఉంటున్న వారిపై ఫిర్యాదు చేశాడు. దీనితో ఇరువురి కంప్లైంట్స్ స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నిహారిక, చైతన్యల వివాహం వైభవంగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగింది.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz