హేమంత్‌ది పరువు హత్యేనని తేల్చిన పోలీసులు

  • IndiaGlitz, [Monday,September 28 2020]

హేమంత్ మర్డర్ కేసును అన్ని రకాలుగా విచారించిన మీదట అతనిది పరువు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే హేమంత్‌ని హత్య చేశారని ఈ కేసును విచారిస్తున్న గచ్చిబౌలి పోలీసులు తేల్చారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి హేమంత్‌ను మర్డర్ చేయించినట్టు నిర్ధారణ అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డి ఒప్పుకున్నారు. అవంతి- హేమంత్‌ల ప్రేమ విషయం తెలుసుకున్న లక్ష్మారెడ్డి తన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించి ఆమెను బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

జూన్‌ 10న ఇంట్లో కరెంట్‌ పోవడంతో సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కాదని తెలుసుకున్న అవంతి ఇంట్లో నుంచి హేమంత్‌తో కలిసి పారిపోయి వివాహం చేసుకుంది. దీంతో రగిలిపోయిన అవంతి తల్లిదండ్రులు.. ఆమె మేనమామతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం హేమంత్‌ను హత్య చేయించారు.
హేమంత్‌ హత్య కేసులో మొత్తం 25మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. నిందితులను 5రోజుల కస్టడి కోరుతూ ఎల్బీనగర్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. జహీరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ మీద సీసీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ను అవంతి, హేమంత్‌ కుటుంబసభ్యులు కలవనున్నారు.

More News

నాగ‌చైత‌న్య రిలీజ్ చేసిన 'ఒరేయ్‌ బుజ్జిగా..' ట్రైల‌ర్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో

బండ్లగణేశ్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

పవర్‌స్టార్‌ వపన్‌కల్యాణ్‌, నిర్మాత బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్లగణేశ్‌ అధికారికంగా ప్రకటించారు.

బాలు సంగీత వర్సిటీ పెట్టాలంటూ జగన్‌కు చంద్రబాబు లేఖ

లెజెండ్రీ సింగర్‌ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా తగు కార్యక్రమాలను

దుష్ప్రచారం వద్దు... ప్రెస్‌మీట్‌ పెడతా!

లెజెండ్రీ సింగర్‌, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కరోనా వైరస్‌ కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.