close
Choose your channels

నాగార్జున ఇంటికి పోలీసు భ‌ద్ర‌త‌

Friday, July 19, 2019 • తెలుగు Comments

నాగార్జున ఇంటికి పోలీసు భ‌ద్ర‌త‌

అక్కినేని నాగార్జున ఇంటికి పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. అందుకు కార‌ణం బిగ్‌బాస్‌. ఆయ‌న బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున ఇంటికి ముట్ట‌డిస్తామ‌ని ఓయూ విద్యార్థి ఐక్య సంఘాలు తెలిపాయి.

దీంతో ముందు జాగ్ర‌త్త‌గా పోలీసులు నాగార్జున ఇంటికి భ‌ద్ర‌త‌ను పెంచారు. బిగ్‌బాస్ మ‌హిళ‌ల‌ను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నార‌ని, స‌భ్యుల‌ను మూడు నెల‌లు పాటు నిర్భందించి ర‌హ‌స్యంగా చిత్రీక‌రిస్తున్నారని, వారితో ముందుగానే బాండ్ పేప‌ర్స్‌పై సంత‌కాలు తీసుకోవ‌డం, తెల్ల‌కాగితాలుపై సంత‌కాలు తీసుకుని మ‌హిళ‌ల‌ను వేధించడం వంటి చ‌ర్య‌ల‌ను నిర్వాహ‌కులు పాల్ప‌డుతున్నారు కాబ‌ట్టి బిగ్‌బాస్ షోను నిలిపి వేయాల‌ని ఓయూ జేఏసీ నాయ‌కులు డిమాండ్ చేశారు. మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz