'పోలీసోడు'కి టైటిల్ సమస్య....

  • IndiaGlitz, [Thursday,April 14 2016]

విజయ్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పోలీసోడు'. తమిళంలో తెరి' అనే టైటిల్ తో తెరకెక్కింది. సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. తమింలో ఈరోజు సినిమా విడుదలైంది. తెలుగులో ఈ వారం విడుదల అంటున్నారు కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పడం లేదు. అయితే తెలుగు టైటిల్ విషయంలో పోలీసు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపీరెడ్డి, సిటీ పోలీస్ సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ రెడ్డి అభ్యంతరం తెలియజేశారు. టైటిల్ పోలీసులను అగౌరవపరిచేదిగా ఉందంటూ వారు అభిప్రాయంపడుతున్నారు. మరి దిల్ రాజు ఇప్పుడు టైటిల్ మారుస్తాడేమో చూడాలి.

More News

ఏ హీరో ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు..ఊపిరి ఒక్క నాగార్జునకే సాధ్యం - దర్శకరత్న దాసరి

మనం,సోగ్గాడే చిన్ని నాయనా,ఊపిరి...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.

అ ఆ టీజ‌ర్ అ ఆ

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనందవిహారి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌లేద‌ట‌..

ప్ర‌భాస్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రిలో ఒక‌టే సందేహం బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే బాహుబ‌లి 2 చూడాల్సిందే అన్నారు.

హీరోయిన్ కోసం గెస్ట్ గా బాలయ్య...

హీరోయిన్ కోసం గెస్ట్ గా వస్తున్నాడు బాలయ్య.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?నిషా కళ్ల త్రిష.గోవి దర్శకత్వంలో త్రిష నటిస్తున్న ద్విభాషా చిత్రం నాయకి.

మహేష్..రైటో రాంగ్గో తేలేది అప్పుడే..

సూపర్ స్టార్ మహేష్...రైటో రాంగ్గో తేలేది అప్పుడే...అనగానే ఎప్పుడు అంటారా..?సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన 24మూవీ రిలీజ్ రోజు.