టాలీవుడ్‌లో విషాదం.. పూజా ఎమోషనల్ ట్వీట్

  • IndiaGlitz, [Saturday,April 17 2021]

టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సత్యం తన సీనీ కెరీర్‌లో ఎన్నో సినిమాలకు ముఖ్యంగా కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. రాజమౌళి-నితిన్‌ కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘సై’కి చీఫ్‌ కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘శ్రీరామదాసు, చందమామ, సాక్ష్యం, అల..వైకుంఠపురంలో’ సినిమాలకు సైతం కో డైరెక్టర్‌గా పనిచేశారు.

సత్యం మరణవార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులంతా ఆయన మరణంపై స్పందిస్తూ.. సంతావం వ్యక్తం చేస్తున్నారు. సత్యం మరణవార్త విని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ట్విటర్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయనతో చేసిన సినిమాలను గుర్తు చేసుకుని సానుభూతి తెలిపింది. ‘‘కోడైరెక్టర్స్‌లో ఒకరైన సత్యం గారి మరణ వార్త చాలా బాధకు గురి చేసింది. ఆయనతో కలిసి నేను మూడు సినిమాలు చేశాను. ‘అరవింద సమేత వీర రాఘవ, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో’ చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ట్వీట్‌ చేసింది.

ఇక సంగీత దర్శకుడు తమన్ సైతం సత్యం మరణంపై స్పందించారు. ఆయన మరణ వార్త విని షాక్ అయ్యానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తమన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘సత్యంగారి మరణ వార్త షాక్‌కు గురి చేసింది. ఒక గొప్ప వ్యక్తిత్వమున్న మనిషి సత్యంగారు. నమ్మకానికి, నిజాయితీకి మారు పేరుగా నిలుస్తారు. సెట్స్‌లో ప్రతి ఒక్కరితోనూ షూటింగ్ సమయంలో చాలా అగ్రెసివ్‌గా మెలుగుతూ ఆర్టిస్టులను, టెక్నీషియన్ టీంను ఫాలో అప్ చేస్తుంటారు. మిమ్మల్ని నిజంగా మిస్ అవుతున్నాం సర్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని తమన్ ట్వీట్ చేశారు.

More News

నేటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా గాంధీ..

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో..

ఏప్రిల్ 30న యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' చిత్రం విడుదల.. 

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు.

విజయ్ ఆంటోని ‘విజయ రాఘవన్’ మే 14న రిలీజ్‌

న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని.

ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం

ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త ప్రయోగానికి టాలీవుడ్ శ్రీకారం చుట్టబోతోంది. సింగిల్ షాట్..

చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి

నటుడిగానూ.. అంతకు మించి రచయితగానూ తెలుగు ప్రేక్షకులకు తనికెళ్ల భరణి సుపరిచితులు. సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన జీవించేస్తారు.