close
Choose your channels

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న పూజా హెగ్డే

Tuesday, February 11, 2020 • తెలుగు Comments

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న పూజా హెగ్డే

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రంటే పూజా హెగ్డే పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. ఈ ఏడాది అప్పుడే అల వైకుంఠ‌పుర‌ములో వంటి భారీ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ప‌క్క యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ 20వ చిత్రంలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా లేటెస్ట్‌గా పూజా హెగ్డే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ త‌దుప‌రి చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నుంది. సాజిద్ న‌డియ‌డ్ వాలా క‌థ‌ను అందిస్తోన్న ఈ చిత్రాన్ని ప‌ర్హ‌ద్ సామ్జీ డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న పూజా హెగ్డే

ఈ చిత్రానికి `క‌బీ ఈద్ క‌బీ దివాలీ` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. 2021 ఈద్ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ప్రస్తుతం స‌ల్మాన్ ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రాధే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత స‌ల్మాన్ త‌న కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయ‌బోతున్నాడు. స‌ల్మాన్ వంటి స్టార్‌తో న‌టించ‌డం పూజా హెగ్డేకు చాలా ప్ల‌స్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. కెరీర్ ప్రారంభంలో మొహంజోదారో చిత్రంలో హృతిక్ స‌ర‌స‌న న‌టించిన పూజాకు.. ఆ సినిమా నిరాశ‌నే మిగిల్చింది. అయితే హౌస్‌ఫుల్ 4 సినిమా ఆమెకు చాలా మంచి పేరుని తెచ్చి పెట్టింది. ఇప్పుడు స‌ల్మాన్‌తో చేసే క‌బీ ఈద్ క‌బీ దివాలీ సినిమా హిట్ అయితే పూజాకు బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Get Breaking News Alerts From IndiaGlitz