Download App

పూజా ప్ర‌వేట్ ఫ్లైట్‌...

ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోలంద‌రితో న‌టిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. మ‌హేశ్ స‌ర‌స‌న మ‌హ‌ర్షి, ఎన్టీఆర్‌తో `అర‌వింద స‌మేత‌`తో పాటు.. ప్ర‌భాస్ స‌ర‌స‌న జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఓ పూజాకు ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అదేంటంటే ఎన్టీఆర్ సినిమా ప‌రంగా ... ఇటీవ‌ల ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు, మూడు రోజులు షూటింగ్‌కు ఇబ్బంది  క‌లిగింది.

కానీ ఎన్టీఆర్ వెంట‌నే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేశాడు. కానీ ఇక్క‌డ పూజా హెగ్డేకు డేట్స్ స‌మ‌స్య వ‌చ్చింది. అక్ష‌య్‌కుమార్‌తో పూజా ఓ సినిమా చేస్తుంది. ఇది జై స‌ల్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఒక ప‌క్క హైద‌రాబాద్ మ‌రో ప‌క్క జై సల్మీర్ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయాలంటే అటు ఇటు ట్రావెల్ చేయాల్సిందే. అయితే హైద‌రాబాద్ నుండి జై స‌ల్మీర్ వెళ్లాలంటే ఒకే ఒక ఫ్లైట్ ఉంది. అది అనుకున్న స‌మ‌యానికి కుద‌ర‌దు. అందుక‌ని ప్రైవేట్ ఫ్లైట్‌లో వెళుతుంది. మిల‌ట‌రీ ఏరియాలోకి ప్రైవేట్ ఫ్లైట్స్‌ను సాధార‌ణంగా అనుమ‌తించ‌రు అయితే.. పూజా మేనేజ‌ర్స్ ఎలాగో అధికారుల‌తో మాట్లాడి మేనేజ్ చేశారు.