close
Choose your channels

#SSMB28 : మహేశ్- త్రివిక్రమ్ మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. సమంతకు ఛాన్స్..?

Thursday, November 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

#SSMB28 : మహేశ్- త్రివిక్రమ్ మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. సమంతకు ఛాన్స్..?

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు అగ్ర కథానాయికగా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో చూసినా పూజానే కనిపిస్తోంది. తెలుగులో సక్సెస్‌తో బాలీవుడ్‌లో సైతం ఆమెకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకో పూజా హెగ్డే సతమతమవుతోందట. ఈ క్రమంలోనే ఓ స్టార్‌ హీరో సినిమాని ఆమె వదులుకున్నట్లుగా ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పూజా వదులుకున్న ఆ సినిమా ఎవరిదో తెలుసా. సూపర్‌స్టార్‌ మహేశ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ.

ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు"తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, "ఖలేజా" తర్వాత ఎన్నో ఏళ్లకు మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా కోసం మహేశ్ సరసన మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారట. ఇప్పటికే వీరిద్దరూ మహర్షిలో కలిసి నటించారు. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’, ‘సర్కస్‌’ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా వున్న పూజా హెగ్డే.. #SSMB28 ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో, చిత్ర యూనిట్ ఆమె స్థానంలో సమంతను సంప్రదించిందట. దీనికి సామ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమాలో ఆమె కన్ఫర్మ్ అయితే మాత్రం ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల తర్వాత మహేశ్ - సమంత కలిసి నటించిన నాలుగో చిత్రం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.