#SSMB28 : మహేశ్- త్రివిక్రమ్ మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. సమంతకు ఛాన్స్..?

  • IndiaGlitz, [Thursday,November 25 2021]

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు అగ్ర కథానాయికగా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో చూసినా పూజానే కనిపిస్తోంది. తెలుగులో సక్సెస్‌తో బాలీవుడ్‌లో సైతం ఆమెకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకో పూజా హెగ్డే సతమతమవుతోందట. ఈ క్రమంలోనే ఓ స్టార్‌ హీరో సినిమాని ఆమె వదులుకున్నట్లుగా ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పూజా వదులుకున్న ఆ సినిమా ఎవరిదో తెలుసా. సూపర్‌స్టార్‌ మహేశ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ.

ఈ మధ్యనే సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అతడు, ఖలేజా తర్వాత ఎన్నో ఏళ్లకు మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా కోసం మహేశ్ సరసన మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారట. ఇప్పటికే వీరిద్దరూ మహర్షిలో కలిసి నటించారు. అయితే ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్‌’, ‘సర్కస్‌’ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా వున్న పూజా హెగ్డే.. #SSMB28 ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో, చిత్ర యూనిట్ ఆమె స్థానంలో సమంతను సంప్రదించిందట. దీనికి సామ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమాలో ఆమె కన్ఫర్మ్ అయితే మాత్రం ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల తర్వాత మహేశ్ - సమంత కలిసి నటించిన నాలుగో చిత్రం కానుంది.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీకి చెదిరిన కెప్టెన్సీ కల.. కనికరించని షన్నూ, సిరికి ముక్కుపుడక

బిగ్‌బాస్ 5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది.

కరోనా బారినపడ్డ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. పరిస్థితి విషమం, సాయం కోసం కొడుకు విజ్ఞప్తి

దేశంలో కరోనా కారణంగా ఎందరో సినీ నటీనటుడు, సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా పలువురు వైరస్ బారినపడుతున్నారు.

జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించి మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది.

'జీ 5'లో 'రిపబ్లిక్' సినిమా చూడండి... మీ స్పందన తెలియజేయండి! - సాయి తేజ్

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'.

ఏపీ అసెంబ్లీ: టాలీవుడ్‌కి షాకిచ్చిన జగన్.. ఇకపై బెనిఫిట్ షోలు కట్, ఆన్‌లైన్‌లోనే టికెట్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే టాలీవుడ్‌కు షాకిచ్చారు.