close
Choose your channels

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

Wednesday, October 21, 2020 • తెలుగు Comments

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ.. సర్‌ప్రైజ్ అంటున్న పూజా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు మరో రెండు రోజుల్లో రాబోతోంది. దీని కోసం ప్రభాస్ అభిమానులు ఇప్పటికే సిద్ధమయ్యారు. క్యాజువల్‌గా అయితే కేక్ కటింగ్‌లు, రక్తదానాలు, భారీ హోర్డింగ్‌లు వంటివి ఏర్పాటు చేసి ధూం ధాం చేస్తారు. కానీ ఈ సారి ప్రభాస్ అభిమానులు కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. సోషల్ మీడియా యుగం నడుస్తోంది కాబట్టి.. దీనిని ప్రభాస్ అభిమానులు చక్కగా వినియోగించుకున్నారు.

తాజాగా ప్రభాస్ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేశారు. అభిమానులంతా ఈ సీడీపీతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రభాస్ మాస్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సీడీపీ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ‌ కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ‘రాధేశ్యామ్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రేరణ పాత్రలో నటిస్తున్న పూజా హెగ్డే.. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రభాస్ అభిమానుల కోసం పెద్ద సర్‌ప్రైజ్ రాబోతోందని వెల్లడించింది. `హాయ్.. నేను `రాధేశ్యామ్` సెట్‌లో ఉన్నాను. రేపు మీ కోసం పెద్ద సర్‌ప్రైజ్ రాబోతోంది. అప్ప‌టివ‌ర‌కు వేచి ఉండండి` అంటూ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియోను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ సర్‌ప్రైజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz