close
Choose your channels

పూజా.. పండగలే టార్గెట్

Friday, February 23, 2018 • తెలుగు Comments

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌. త‌న ఖాతాలో ఒక్క విజ‌యం లేక‌పోయినా.. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తేడాది అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన పూజా.. ఈ ఏడాది ముగ్గురు అగ్ర హీరోల‌తో క‌లిసి న‌టించే ఛాన్స్‌లు ప‌ట్టేసింది. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం కోసం ఓ ప్ర‌త్యేక గీతం చేస్తున్న పూజా.. మ‌హేష్ బాబు 25వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశాన్ని ప‌ట్టేసింది.

అలాగే ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించే చిత్రంలోనూ పూజానే క‌థానాయిక‌. విశేష‌మేమిటంటే.. మ‌హేష్‌, ఎన్టీఆర్‌తో పూజా న‌టిస్తున్న సినిమాలు తెలుగువారికి ప్రీతి పాత్ర‌మైన పండుగ‌ల సంద‌ర్భాల్లోనూ రానుండ‌డం. తార‌క్, పూజా తొలి సారిగా న‌టించ‌నున్న చిత్రం మార్చిలో సెట్స్ పైకి విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా సంద‌డి చేయ‌నుండ‌గా.. మ‌హేష్‌తో  పూజా న‌టించ‌నున్న చిత్రం ఏప్రిల్‌లో మొద‌లై వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌డి చేయ‌నుంది. మొత్తానికి.. స్టార్ హీరోల కాంబినేష‌న్‌ల‌తో పూజా పండ‌గ చేసుకోనుంద‌న్న‌మాట‌.