ఏపీ కొత్త కేబినెట్.. మంత్రులకు శాఖల కేటాయింపు, రోజాకు ఏ శాఖంటే..?

అలకలు, అసంతృప్తులు, ధిక్కార స్వరాలు, రాజీనామాలు , నిరసనలు ఇలా రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై కనిపించిన పరిస్థితులు. సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్‌ను పునర్వ్యస్ధీకరిస్తుండటమే ఇందుకు కారణం. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ వెంటే వున్నా నేటికీ మంత్రి పదవి రాకపోవడంతో కొందరు సీనియర్లు.. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జగన్ ఇలాంటివి పట్టించుకోకుండా 25 మందితో కూడిన తన కొత్త టీమ్‌ను అనౌన్స్ చేశారు. ఇకపోతే.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయం 11.31 నిమిషాలకు అమరావతిలోని సచివాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో జరిగింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 25 మంది చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతా బాగానే వుంది కానీ ఎవరెవరికీ ఏ శాఖలు కట్టబెట్టారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి గంటల వ్యవధిలోనే తెరదించారు జగన్. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు.

మంత్రులు- శాఖలు

1బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ
2. ధర్మాన ప్రసాద రావు - రెవెన్యూ శాఖమంత్రి
3. సిదిరి అప్పల రాజు - మత్స, పశుసంర్ధక
4. గుడివాడ అమరనాథ్ - పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ
5. ముత్యాల నాయుడు - పంచాయతీ రాజు, రూరల్ డెవలప్‌మెంట్
6. దాడిశెట్టి రాజు - రోడ్లు, భవనాలు
7. చెల్లుబోయిన వేణుగోపాల్ - ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమం
8. విశ్వరూప్ - ట్రాన్సపోర్టు.
9. తానేటి వనిత - హోమ్ శాఖ
10. కారుమూరి నాగేశ్వర రావు - పౌర సరఫరాలు
11. కొట్టు సత్యనారాయణ - దేవాదాయ శాఖ
12. జోగి రమేష్ - గృహ నిర్మాణం
13. అంబటి రాంబాబు - ఇరిగేషన్ శాఖ
14. విడుదల రజని - వైద్య ఆరోగ్య శాఖ
15. మెరుగు నాగార్జున - సాంఘిక సంక్షేమ శాఖ
16. ఆదిమూలపు సురేష్ - మున్సిపల్ శాఖ
17. కాకాని గోవర్దన్ రెడ్డి - వ్యవసాయం, సహకార మార్కెటింగ్
18. ఉష శ్రీ చరణ్ - మహిళా శిశు సంక్షేమం
19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్, ఫారెస్ట్
20. రోజా - టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ
21. నారాయణ స్వామి - ఆబ్కారీ
22. జయరాం - కార్మిక శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్ధిక శాఖ
24.రాజన్న దొర - ఎస్టీ సంక్షేమం
25.అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం

More News

NTR @ 25 Years : జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకు పాతికేళ్లు.. 13 ఏళ్ల వయసులోనే హీరోగా

అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

ఎన్నాళ్లో వేచిన ఉదయం: మంత్రిగా ప్రమాణం చేసిన రోజా.. ఇక సినిమాలు, జబర్దస్త్‌కు గుడ్‌బై

మంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన సీనియర్ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా కలలు ఫలించాయి.

ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ రావడం వల్ల వీక్షకులకు ZEE5 పై రెస్పెక్ట్ పెరుగుతుంది...: 'గాలివాన' ప్రి రిలీజ్ ఈవెంట్ లో రాధికా శరత్ కుమార్

గోదావరి జిల్లాలో ఉన్న ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగే కథ.రెండు కుటుంబాలు సరస్వతి, కొమర్ రాజు కుటుంబం వీరిద్దరూ వియ్యంకులు.

చానాళ్లకు బాలీవుడ్‌ గడప తొక్కుతోన్న తేజ.. ఇద్దరు స్టార్స్‌తో సినిమా, వివరాలివే...!!

దర్శకుడు తేజ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్‌గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన తనదైన మార్క్ చూపించారు.

గాడ్ ఫాదర్‌ సెట్స్‌కి పూరి జగన్నాథ్.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవిని  డైరెక్ట్ చేయాలన్నది ఎంతో మంది దర్శకుల కల.