పుకార్లపై స్పందించిన పోసాని కృష్ణమురళి
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు పోసాని కృష్ణమురళికి ఈమధ్య శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ శస్త్రచికిత్స వల్ల పోసాని కృష్ణమురళికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఓ వీడియో ద్వారా పోసాని కృష్ణమురళి స్పందించారు. తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమేనని, అయితే తానిప్పుడు కోలుకుంటున్నానని, మళ్లీ తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖండించారు. అంతే కాకుండా వారం పదిరోజుల్లో షూటింగ్లకు హాజరుకావడానికి రెడీ అవుతున్నానని తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నవారందరికీ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు పోసాని కృష్ణమురళి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.