పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం క్రేజీ క్రేజీ ఫీలింగ్ . సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు . షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది .

ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది.

నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు . ప్రసాద్ లాబ్స్ , రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా , విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు .

విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా సుభాష్ దొంతి , ఆర్ట్ నాగు , కొరియోగ్రఫీ రాజకిరణ్ , చార్లీ .

More News

స్టూడెంట్ పాత్ర‌లో..

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది.

ర‌ష్మిక బ్రేకప్‌పై ఆమె త‌ల్లి ప్ర‌క‌టన‌.. ర‌క్షిత్ స్పంద‌న‌...

క‌న్న‌డంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. తొలి చిత్రంతో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో..

జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. `36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌)..

సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను: నాగార్జున

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు..

రవిబాబు 'అదిగో' ట్రైలర్ లాంచ్...

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్ గా చేసుకొని సబ్జెక్ట్ ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవి బాబు తాజా చిత్రం 'అదిగో'.