close
Choose your channels

నా బర్త్ డే వేడుకలు వాయిదా వేస్తున్నా : కలెక్షన్ కింగ్

Tuesday, March 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా బర్త్ డే వేడుకలు వాయిదా వేస్తున్నా : కలెక్షన్ కింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 140 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కూ పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ కోవిడ్-19 వైరస్ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ స్కూల్స్ మొదలుకుని సినిమా థియేటర్స్ అన్నీ మూసివేయడం జరిగింది. మరోవైపు టాలీవుడ్‌లో దాదాపు అన్ని షూటింగ్స్‌ను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు నటీనటులు, సెలబ్రిటీలు తగు జాగ్రత్తలు చెబుతూ వీడియోలు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం..!

తాజాగా కోవిడ్-19పై సీనియర్ నటుడు, నిర్మాత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘పంచభూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం.. అందుకే ఈ కరోనా వ్యాధి ఒక దేశము నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోంది. ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నాను. కోవిడ్ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొండి’ అని ఆ ప్రకటనలో మోహన్ బాబు రాసుకొచ్చారు.

మీ అభిమానమే నాకు కొండంత అండ..!

‘చుట్టుపక్కల వాళ్లు బాగుంటేనే మనం బాగుంటాం. మీరు మా ఇంటికి రావాలి.. నేను మీ ఇంటికి రావాలి. అందరూ బాగుండాలనేదే నా సిద్ధాంతం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీ అభిమానమే నాకు కొండంత అండ. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష.. అందరికీ శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు ఉగాది మీ జీవితంలో వెలుగులు తేవాలని కోరుకుంటున్నాను. నాకు అభినందనలు తెలియజేయడానికి ఎవరూ రావద్దు’ అని అభిమానులకు మోహన్ బాబు సూచించారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.