హరిహర వీరమల్లు అదిరిపోయే సెట్స్..  ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని సత్కరించిన పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Friday,April 08 2022]

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడోర్ లాజరోవ్ నేతృత్వంలో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ సినిమా సెట్స్‌కు సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు పవన్. హైదరాబాదులో హరిహర వీరమల్లు కోసం తోట తరణి అద్భుతమైన సెట్స్ ను రూపొందించారు. 17వ శతాబ్దం నాటి కథకు తగ్గట్టుగా సెట్స్ వేశారు. వీటిని పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు.

ఏ.ఎం. రత్నం మెగా సూర్యా మూవీస్ బ్యానర్ పై ఏ.దయాకర్ రావుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మొఘలుల కాలం నాటి నేపథ్యంలో సాగనుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం కోసం భారీ జలపాతం సెట్ వేశారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే.. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశారు పవర్ స్టార్. భీమ్లానాయక్ క్యారెక్టర్ నుంచి వీరమల్లుగా పవన్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. భీమ్లాకు వీరమల్లుకు పూర్తిగా తేడాలు కనిపిస్తున్నాయి. బాడీని ఫిట్‌గా ఉంచేందుకు పవన్ కల్యాణ్ నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరోవైపు హరిహర వీరమల్లులోని యుద్ధ విన్యాసాల కోసం ఫ్లైక్సిబుల్ బాడీ కోసం శ్రమిస్తున్నారు పవర్ స్టార్. ఈ పవర్ ఫుల్ రిహార్సల్స్ కు సంబంధించిన ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. వాటిల్లో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జిటిక్ గా, ఫిట్ గా కనిపిస్తున్నారు. అలాగే బళ్లెం, కర్రసాములపైనా పవన్ కసరత్తు చేస్తున్నారు.

More News

‘పుష్ప.. పుష్పరాజ్‌.. జ‌వాబులు రాసేదే లే’.. టెన్త్ స్టూడెంట్ ఆన్సర్ షీట్‌‌‌ వైరల్, టీచర్‌కు షాక్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు,

రియల్ స్టార్ సోనూసూద్‌కు అరుదైన గౌరవం.. ‘‘గోల్డెన్ వీసా’’ ఇచ్చిన దుబాయ్

కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత కూడా తన సామాజిక సేవతో ఎంతోమంది అవసరాలు తీర్చారు సోనూసూద్.

నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లా.. నమ్మలేకపోతున్నా: పూజా హెగ్డే

నెల్సన్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్- పూజా  హెగ్డే నటించిన ‘‘బీస్ట్’’ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది.

సోదరిగానైనా గౌరవించాలిగా .. ఎన్నోసార్లు అవమానించారు: కేసీఆర్ సర్కార్‌పై తమిళిసై ఆరోపణలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌పై డామినేషన్… మీడియాకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన చరణ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.