Pawan - Sujeeth : సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్.. మండే సూర్యుడికి ఎదురుగా పవన్, ఫ్యాన్స్‌కి పూనకాలే

  • IndiaGlitz, [Sunday,December 04 2022]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి జోరుమీదున్నారు. రాజకీయాలతో బిజిబిజీగా వుంటోన్న ఆయన గ్యాప్‌లో సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో వున్నారు. ఇది సెట్స్ మీద వుండగానే హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా పవన్ మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపారు. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ నటించనున్నారు. ఈ కాంబినేషన్‌ సెట్ అయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అంతా దీనిని పుకారుగా కొట్టేశారు. పవన్ ఇప్పుడున్న బిజీలో మరే సినిమాకు ఓకే చెప్పరని కొందరంటే.. సుజిత్‌తో సినిమా అంటే కష్టంలే అంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.

తొలుత గాలివార్తగా పవన్-సుజిత్ కాంబినేషన్:

అయితే అందరి మబ్బులు విడిపోయేలా.. ఈ వార్తే నిజమై కూర్చొంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘‘పవన్- సుజిత్’’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. ఆదివారం 8.55 గంటలకు అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో పవన్ వెనుకవైపు నిలబడి వున్నట్లు కనిపిస్తున్నాడు. దానిపై ‘‘They Call Him #OG ’’ అని రాసి వుంది.

సాహో తర్వాత మరో సినిమా చేయని సుజిత్:

ప్రభాస్‌తో తెరకెక్కించిన సాహో నిరాశ పరచడంతో గత మూడేళ్లుగా సుజిత్ మరో సినిమా చేయలేదు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో సుజిత్ ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. చివరికి పవర్‌స్టార్‌ను మెప్పించిన సుజిత్ ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టైలిష్ అండ్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. దీని కంటే ముందే తమిళ సూపర్‌హిట్ మూవీ ‘‘తేరీ’’ (విజయ్, సమంత నటించారు)ని రీమేక్ చేయాలని పవన్ భావించారట. కానీ సుజిత్ చెప్పిన లైన్ నచ్చడంతో దీనిని పట్టాలెక్కించాలని పవన్ నిర్ణయించినట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

More News

BiggBoss: రేవంత్‌కి సర్‌ప్రైజ్, ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీహాన్.. సీజన్‌కే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయా

బిగ్‌బాస్ తెలుగు 6 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంటెస్టెంట్స్‌ని ఫైనల్‌కి పంపే ‘‘టికెట్ టు ఫినాలే’’ టాస్క్ హోరాహోరీగా సాగుతోంది.

Chiranjeevi : ఆయనలా ఎవ్వరికీ కాకూడదు, అందుకే బ్లడ్ బ్యాంక్.. అభిమానులే లేకపోతే : చిరంజీవి వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు.

'వీరసింహారెడ్డి' జనవరి 12న విడుదల

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'.

Lucky Lakshman: ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది - సోహైల్

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’.

Lucky Lakshman Teaser : బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ ‘‘లక్కీ లక్ష్మణ్’’ టీజర్ ఎలా వుందంటే..?

బిగ్‌బాస్ షో వల్ల కొద్దో గొప్పో పేరు వచ్చిన వారు వున్నారంటే వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ఒకరు సయ్యద్ సోహైల్.