వెయ్యి మందితో యాక్షన్ ఎపిసోడ్.. ఉస్తాద్ భగత్ సింగ్‌ నుంచి క్రేజీ అప్‌డేట్, ఫుల్ స్వింగ్‌లో పవన్

  • IndiaGlitz, [Saturday,April 15 2023]

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం హరీశ్ శంకర్ ఏళ్ల పాటు ఎదురుచూశారు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు హరీశ్ శంకర్. ఇలా మొదలెట్టారో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిపోయింది. హైదరాబాద్‌లో 8 రోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఓ భారీ యాక్షన్ సీన్, పిల్లలతో కామెడీ సీన్, శ్రీలీల-పవన్ మధ్య రోమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇక అన్నింట్లోకి రామ్ లక్ష్మణ్ తెరకెక్కించిన యాక్షన్ సీన్ గురించి ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, వంద మంది ఫైటర్లు ఈ సీన్ కోసం కష్టపడ్డారట.

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు :

ఇకపోతే.. గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత హరీశ్ శంకర్ , పవన్ కల్యాణ్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలల హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

పవన్ చేతిలో నాలుగు సినిమాలు :

ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, సుజిత్ సినిమాతో పాటు మరో సినిమా వున్నాయి. వీటన్నింటిని వేగంగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పవన్ బిజీ కానున్నారు. దీనిని దృష్టిలో వుంచుకునే షూటింగ్‌లు త్వరగా ముగించాలని కూడా పవన్ నుంచి దర్శక నిర్మాతలకు ఆదేశాలు వెళ్లినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

More News

CM KCR:హైదరాబాద్‌కు మరో మణిహారం : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్..  ప్రత్యేకతలివే

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్

Vimanam:తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని ఆవిష్క‌రించే ‘విమానం’... ప్రోమో

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు.

JC Prabhakar Reddy:ఇంత కష్టమా, కాలికి బొబ్బలొచ్చినా లెక్క చేయట్లే.. లోకేష్‌‌ని చూసి కంటతడిపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Elon Musk:ట్విట్టర్‌‌తో డబ్బు సంపాదించుకోండి.. యూజర్స్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి తలా తోక లేని నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు ఎలాన్ మస్క్.

Pawan Kalyan : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి ప్రకటన.. పవన్ కల్యాణ్ స్పందన ఇదే

ఇప్పటికిప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే .