Turkey : టర్కీ, సిరియాలను వణికించిన భారీ భూకంపం.. ఇప్పటి వరకు 560 మంది, కోట్లలో ఆస్తినష్టం

  • IndiaGlitz, [Monday,February 06 2023]

సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపానికి టర్కీ, సిరియా దేశాలు చివురుటాకుల వణికిపోయాయి. భూకంప ధాటికి వేలాది ఇళ్లు నేలమట్టమవ్వగా.. ఇప్పటి వరకు 560 మందికిపైగా మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లెక్కకు మిక్కిలిగా క్షతగాత్రులయ్యారు. టర్కీ కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.

గాఢ నిద్రలోనే గాల్లో కలిసిన ప్రాణాలు:

తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో వున్న వేళ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్‌కు 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు గుర్తించారు. దీని ధాటికి దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లోని వందలాది భవనాలు కుప్పకూలాయి. టర్కీలో 284 మంది మరణించగా, 2300 మంది తీవ్రంగా గాయిపడినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇక సిరియా విషయానికి వస్తే ప్రభుత్వ ఆధీనంలోని 237 మంది మరణించగా, 639 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెబల్స్ అధీనంలో వున్న ప్రాంతాల్లో 47 మంది మరణించారు. ఇరు దేశాల్లోనూ శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుని వుండటంతో.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.

మోడీ దిగ్భ్రాంతి:

మరోవైపు భూకంపం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. టర్కీ, సిరియాలకు అండగా వుంటామని ఆయా దేశాలు ప్రకటించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ .జైశంకర్ సైతం భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. ఆయా దేశాలకు అండగా వుంటామని ప్రకటించారు.

More News

Telangana Budget : సంక్షేమానికి పెద్దపీట, ఏ రంగానికి ఎంతంటే .. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌న ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Unstoppable 2:టీడీపీలో చేరమన్న బాలయ్య.. పవన్‌ని సినిమాలు మానేయమంటున్న ఫ్యాన్స్ , అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమవుతోన్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే.

Balakrishna:మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి నర్సులను కెలికిన నటసింహం, భగ్గుమన్న నర్సుల సంఘం

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Jr Ntr : అప్‌డేట్స్ కోసం ఒత్తిడి తేవొద్దు.. ఏమైనా వుంటే భార్య కంటే ముందు మీకే చెబుతా : అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్

టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhanupriya:భర్త మరణం, ఒంటరితనం.. ఇప్పుడు మొమరీలాస్‌: సీనియర్ హీరోయిన్ భానుప్రియ కష్టాలు

భానుప్రియ.. ఈ పేరు వినగానే కలువల్లాంటి పెద్ద కళ్లు, అద్భుతమైన డ్యాన్సర్ గుర్తొస్తారు. 80వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్, హిందీ ప్రేక్షకులను అలరించారు భానుప్రియ.