సంక్రాంతికి పవర్ స్టార్‌ వర్సెస్ సూపర్ స్టార్ !

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

స్టార్ వార్ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. అదీ ముఖ్యంగా సంక్రాంతికి ఈ వార్ తప్పనిసరి అవుతుంది. అయితే ఎవరెవరికి పడుతుందో మాత్రం చెప్పడం కష్టం. అయితే వార్ మాత్రం స్టార్ హీరోల మధ్యనే జరుగుతూ ఉంటుంది. అయితే 2022 సంక్రాంతి వార్‌కు సిద్ధమవుతున్న స్టార్ హీరోలెవరో కూడా ఇప్పటికే తెలిసిపోయింది. దీంతో ఆసక్తి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

పవర్ స్టార్‌ను సూపర్ స్టార్ ఢీకొట్టి బరిలో నిలవగలరా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్. పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’తో వస్తుండగా.. పవర్ స్టార్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’గా సంక్రాంతి బరిలోకి దిగనున్నారు. అయితే పవర్ స్టార్ సినిమాపై అయితే ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో మహేష్ సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఇద్దరి సినిమాలూ మంచి సక్సెస్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.

అయితే అసలు పోటీ అంతా కలెక్షన్ విషయంలోనే ఎవరెంత కలెక్ట్ చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. గతేడాది అంటే 2020లో మహేష్.. మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తోనే తలపడిన విషయం తెలిసిందే. అప్పుడు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో మహేష్.. ‘అల వైకుంఠపురములో’తో బన్నీ సంక్రాంతి బరిలో దిగారు. అయితే అప్పుడు ఎవరికి వారే మంచి సక్సెస్ సాధించారు. అయితే ఈ రెండు సినిమాలు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇలా చూస్తే వచ్చే సంక్రాంతికి పవర్ స్టార్, సూపర్ స్టార్ సినిమాలు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తాయో.. ఏ సినిమా ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందోననే విషయం ఆసక్తికరంగా మారింది.

More News

సంక్రాంతి బరిలో నిలవనున్న పవన్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.

3 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిన ‘మోసగాళ్లు’ ట్రైలర్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోసగాళ్లు మూవీ ట్రైలర్‌ను ఈనెల 25న మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

వైఎస్, జగన్ దంపతుల పేర్లు కలిసొచ్చేలా డిప్యూటీ సీఎం కూతురికి నామకరణం

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి ఇటీవల పాప పుట్టిన విషయం తెలిసిందే.

‘సలార్’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది..

‘కేజీఎఫ్’ చిత్ర యూనిట్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోందంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. అదీకాకుండా ఆ చిత్రంలో ‘బాహుబలి’

'హిట్‌2' అనౌన్స్‌ చేసిన నిర్మాత నాని.. హీరో మారుతున్న‌ట్లు హింట్

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ కథానాయకుడు విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`.