వైఎస్ జగన్ గురించి ప్రభాస్ ఏమన్నారంటే...

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆగస్టు 30 అభిమానుల ముందుకు రానుండటంతో ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో మునిగి తేలుతోంది. తాజాగా ఓ తమిళ యూ ట్యూబ్ చానెల్‌కు ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమాతో పాటు.. ఏపీ రాజకీయాల ప్రస్తావనకు కూడా వచ్చింది.

ప్రశ్న : వైఎస్ జగన్ గురించి చెప్పండి..!?
ప్రభాస్ : రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే యంగ్ సీఎంగా ఆయన చాలా బాగా చేస్తున్నారు.

ప్రశ్న: తమిళనాట వైఎస్ జగన్‌ను పొలిటికల్ బాహుబలిగా పిలుస్తున్నారు..? ఆయన గురించి మీరేం అనుకుంటున్నారు!?
ప్రభాస్ : ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనే నమ్మకం తనకుందని డార్లింగ్ సమాధానం ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోకుండానే.. ఒంటరిగా పోటీచేసిన వైసీపీ.. ఎవరూ, కనీసం వైఎస్ జగన్ కూడా ఊహించని రీతిలో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం.. అంతేకాదు 22 పార్లమెంట్ల సీట్లు దక్కించుకోవడం ఆషామాషీ విషయమేం కాదు.. ఇది నిజంగా హిస్టరీని బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

More News

విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక క్లారిటీ

సినీ ఇండస్ట్రీలో నటీనటులపై వార్తలకు కొదువ ఉండదు. ఏమీ లేకపోయినా వార్తలే.. అన్నీ ఉన్నా వార్తలే..

బీజేపీ వల్లే వైఎస్ జగన్ సీఎం అయ్యారా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గెలవడానికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్మ, కర్మ, క్రియ బీజేపీనేనా..?

ఆగస్ట్ 23న బోయ్ చిత్రం..

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా బోయ్.

హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

``నేను హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదు. విలన్ అవుదామనే వచ్చాను. అయితే నన్ను హీరోగా చేసిన వ్యక్తి కలైజ్ఞానంగారే`` అని అన్నారు

20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`.