బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పండగే!

  • IndiaGlitz, [Friday,December 02 2022]

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం, ఆయన అల్లరి, గెస్ట్‌లతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఒక్క షోతోనే ఆహా‌కు లక్షలాది మంది కొత్త సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్‌ 2కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. తొలి ఎపిసోడ్‌కు టీడీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్‌లు హాజరయ్యారు. తర్వాత విశ్వక్‌‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. శర్వానంద్- అడవి శేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- కేఆర్ సురేష్ రెడ్డి- రాధికలు మిగిలిన ఎపిసోడ్‌లకు హాజరయ్యారు.

అన్‌స్టాపబుల్ 2కి గెస్ట్‌ల కొరత:

ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలంతా షూటింగ్‌లతో బిజీగా వుండటంతో ‘‘అన్‌స్టాపబుల్ 2’’కి గెస్ట్‌ల కొరత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెకండ్ సీజన్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వంటి వారిని గెస్ట్‌లుగా తీసుకొచ్చింది ఆహా టీమ్. అయితే రాజకీయాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి తప్పించి.. ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కి మాత్రం వారి రాక ఏమాత్రం కిక్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్‌ని బాలయ్య డీల్ చేయగలరా:

అయితే అన్‌స్టాపబుల్‌కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ని ఈ షోకు తీసుకురావాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ ‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూల్లో , వేదికలపై మాట్లాడేందుకు సిగ్గు మొగ్గలేసే ప్రభాస్‌.. బాలయ్య జోష్‌ని తట్టుకోగలడా అనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అయితే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, శర్శానంద్ లాంటి కుర్రహీరోలను బాలయ్య డీల్ చేసిన తీరు గుర్తొచ్చి .. ప్రభాస్‌నైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలకృష్ణ ఈజీగా ఇంటర్వ్యూ చేసేస్తాడని అంటున్నారు. అంతా బాగానే వుంది కానీ.. ఇంతకీ ప్రభాస్‌ అన్‌స్టాపబుల్‌కి వస్తాడా లేక ఇది గాలివార్తా అన్నది తెలియాల్సి వుంది.

చేతినిండా ప్రాజెక్ట్‌లతో డార్లింగ్:

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చేస్తున్నారు. వీటన్నింటిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి . ఇవి కాకుండా మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

More News

'కథ వెనుక కథ' టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్

విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్

300 మంది ముందు ముద్దుపెట్టిన వరుడు: హర్ట్ అయిన వధువు, పెళ్లి క్యాన్సిల్.. చివరిలో ట్విస్ట్

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. యువతీ యువకులు యుక్త వయసుకు వచ్చిననాటి నుంచి తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటూ వుంటారు.

BiggBoss: శ్రీహాన్‌కు ఫేవర్‌గా శ్రీసత్య, కాలితో తన్నిన కీర్తి... ఓటమి బాధలో రేవంత్

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలిపోనుంది.

Singer Revanth : తండ్రైన సింగర్ రేవంత్... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత , ఫ్యాన్స్ సంబరాలు

బిగ్‌బాస్ 6 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్, విన్నర్ మెటీరియల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు రేవంత్ అనే. మనోడికి కొంచెం దూకుడు ఎక్కువగాని,

జైళ్లో పెడతారా పెట్టుకోండి.. ఏమైతది : కేంద్రంతో ‘‘సై’’ అన్న కల్వకుంట్ల కవిత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె,