close
Choose your channels

దుల్కర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్‌?

Friday, May 22, 2020 • తెలుగు Comments

దుల్కర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్‌?

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఓకే బంగారంతో అటు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌క్సెస్ కొట్టాడు. అలాగే మ‌హాన‌టిలో జెమినీగ‌ణేశ‌న్ పాత్ర‌ధారిగా త‌న న‌ట‌న‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గర‌య్యారు. రీసెంట్‌గా కూడా త‌మిళ చిత్రం రీమేక్ క‌నులు క‌నుల‌ను దోచాయంటే సినిమా కూడా మంచి టాక్‌నే సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీద‌త్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ తోడుగా పూజాహెగ్డే న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రంతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంలో న‌టిస్తోంది పూజా హెగ్డే.

దుల్కర్‌తో ప్ర‌భాస్ హీరోయిన్‌?

ఈ సినిమాలో దుల్క‌ర్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. దుల్క‌ర్‌తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే దానిపై అశ్వినీద‌త్ క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. కరోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి మ‌రింత క్లారిటీ రానుంద‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz