close
Choose your channels

నిజ‌మేనా.. ఆమేనా.. ప్ర‌భాస్‌?

Monday, August 19, 2019 • తెలుగు Comments

నిజ‌మేనా.. ఆమేనా.. ప్ర‌భాస్‌?

`సాహో` ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌భాస్ అండ్ టీమ్ ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌చారప‌ర్వం సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రితో ఏం మాట్లాడినా న్యూస్ అవుతోంది. తాజాగా ఆయ‌న క‌రెంట్ రిలేష‌న్ షిప్ గురించి చెప్పిన మాట‌లు కూడా బాగానే వైర‌ల్ అయ్యాయి. సోమ‌వారం పొద్దున్నుంచి `సాహో`కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ సాంగ్ కోసం లెగ్ షేక్ చేసింద‌ట‌. ప్ర‌భాస్‌, జాక్వ‌లిన్ క‌లిసి బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

సో చిత్ర యూనిట్ ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన‌ట్టు స్పెష‌ల్ సాంగ్‌లో ఎవ్లిన్ శ‌ర్మ మాత్ర‌మే కాదు, జాక్వ‌లిన్ కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం కూడా ఏదో ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో ప్ర‌భాస్ చెప్పేస్తే బావుంటుంది. అన్న‌ట్టు ఈ సినిమాను వంశీ, ప్ర‌మోద్‌, భూష‌ణ్ క‌లిసి నిర్మిస్తున్నారు. సుజిత్ ద‌ర్శ‌కుడు. జిబ్ర‌న్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. ఫుల్ హై మోడ్ యాక్ష‌న్‌తో ఇప్ప‌టికే సిల్వ‌ర్ స్క్రీన్ మీద ధ‌గ‌ధ‌గ‌లు పుట్టిస్తోంది `సాహో`. ఈ 30న ఆ ఫైర్ ఏ రేంజ్‌లో స్ప్రెడ్ అవుతుందో చూడాలి మ‌రి.

Get Breaking News Alerts From IndiaGlitz