నిజ‌మేనా.. ఆమేనా.. ప్ర‌భాస్‌?

  • IndiaGlitz, [Monday,August 19 2019]

'సాహో' ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌భాస్ అండ్ టీమ్ ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌చారప‌ర్వం సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రితో ఏం మాట్లాడినా న్యూస్ అవుతోంది. తాజాగా ఆయ‌న క‌రెంట్ రిలేష‌న్ షిప్ గురించి చెప్పిన మాట‌లు కూడా బాగానే వైర‌ల్ అయ్యాయి. సోమ‌వారం పొద్దున్నుంచి 'సాహో'కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ సాంగ్ కోసం లెగ్ షేక్ చేసింద‌ట‌. ప్ర‌భాస్‌, జాక్వ‌లిన్ క‌లిసి బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

సో చిత్ర యూనిట్ ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన‌ట్టు స్పెష‌ల్ సాంగ్‌లో ఎవ్లిన్ శ‌ర్మ మాత్ర‌మే కాదు, జాక్వ‌లిన్ కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం కూడా ఏదో ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో ప్ర‌భాస్ చెప్పేస్తే బావుంటుంది. అన్న‌ట్టు ఈ సినిమాను వంశీ, ప్ర‌మోద్‌, భూష‌ణ్ క‌లిసి నిర్మిస్తున్నారు. సుజిత్ ద‌ర్శ‌కుడు. జిబ్ర‌న్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. ఫుల్ హై మోడ్ యాక్ష‌న్‌తో ఇప్ప‌టికే సిల్వ‌ర్ స్క్రీన్ మీద ధ‌గ‌ధ‌గ‌లు పుట్టిస్తోంది 'సాహో'. ఈ 30న ఆ ఫైర్ ఏ రేంజ్‌లో స్ప్రెడ్ అవుతుందో చూడాలి మ‌రి.

More News

జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

బెల్లంకొండ జూనియ‌ర్... బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది.

హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`.

నిజమెంతో పూరియే చెప్పాలి?

కొత్త హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌డంలో పూరి ముందుంటారు. ఆయ‌న‌కున్న పూరి క‌నెక్ట్స్ సంస్థ స‌హ‌కారంతో ముంబై హీరోయిన్స్‌ను తెలుగులోకి ప‌రిచ‌యం చేశారు.

ఐదు భాష‌ల్లో సైరా

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

సెప్టెంబర్‌ 8న జరిగే తెలుగు సినీరథసారథులరజతోత్సవ వేడుకకు మా వంతు సహాకారం అందిస్తాం... సి కళ్యాణ్‌

సినీ నిర్మాణంలో ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా