'నువ్వు తోపు రా' ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న చిత్రం 'నువ్వు తోపురా'. యునైటెడ్ ఫిలింస్‌, ఎస్‌.జె.కె. ప్రొడ‌క్ష‌న్స్(యు.ఎస్‌.ఎ) ప‌తాకాల‌పై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రినాథ్ బాబు.బి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మే 3న సినిమా విడుద‌ల‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ - సుధాక‌ర్ కోమాకుల హీరోగా చేసిన 'నువ్వు తోపురా' సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ఈ సినిమాతో సుధాక‌ర్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ఎంటైర్ యూనిట్‌ను అభినందించిన ప్ర‌భాస్‌గారికి థాంక్స్‌. అలాగే అల్లు అర‌వింద్‌గారికి, బ‌న్ని వాసుగారు అందిస్తోన్న స‌హ‌కారానికి ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. సూరి అనే హైద‌రాబాద్ కుర్రాడి జీవితానికి సంబంధించిన క‌థ‌. ఎలాంటి బాధ్య‌త‌లు లేకుండా తిరిగే హీరో..ఎలా మారాడు. అమెరికా ఎందుకు వెళ్లాడు అనేదే క‌థ‌. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'దిక్సూచి'

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌

సింగిల్ సాంగ్‌తో వావ్ అనిపించిన అమెరికా కోయిలలు

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్నోళ్లు దునియానే ఏలొచ్చు.. అనేది అక్షర సత్యం.

నిజాయ‌తీతో జెన్యూన్‌గా క‌థ చెప్పిన‌ప్పుడు మ్యాజిక్ క్రియేట్ అవుతుంద‌ద‌ని 'జెర్సీ' తో ప్రూవ్ అయ్యింది - నాని

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుద‌లైంది.

'RRR' లో వారిద్ద‌రూ న‌టించ‌లేదా?

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `RRR`. ఇందులో రాంచ‌రణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది.

బండ్ల గ‌ణేష్ పప్పుసుద్ద‌

న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గ‌ణేష్ త‌ర్వాత నిర్మాత‌గా మారి స్టార్ హీరోల‌తో సినిమాలు చేశాడు.