మూడు భాషల్లో ప్రభాస్..!

  • IndiaGlitz, [Tuesday,September 27 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న‌తాజా చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్ధ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు, త‌మిళ్ లో రూపొందించాలి అనుకున్నారు. అయితే....ప్ర‌భాస్ రేంజ్ దృష్టిలో పెట్టుకుని హిందీలో కూడా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. బాలీవుడ్ లో ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీస్ కి దాదాపు 25 నుంచి 30 కోట్ల బిజినెస్ జ‌రుగ‌చ్చు అనేది అంచ‌న‌.
అందుక‌నే 60 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించాలి అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు 100 కోట్ల‌తో భారీగా నిర్మించేందుకు ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇటీవ‌ల హిందీ వెర్షెన్ కి సంబంధించి డైలాగ్ వెర్షెన్ పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఈ భారీ చిత్రాన్నిడిసెంబ‌ర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More News

స్టూడెంట్ నెం 1 స‌క్సెస్ క్రెడిట్ పృధ్వీతేజ్ కే చెందుతుంది - రాజ‌మౌళి..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన స్టూడెంట్ నెం 1 చిత్రం రిలీజై నేటికి 15 ఏళ్లు పూర్త‌య్యింది. స్టూడెంట్ నెం 1 చిత్రం రాజ‌మౌళికి మొద‌టి చిత్రం. ఎన్టీఆర్ కి రెండవ చిత్రం. వీరిద్ద‌రి కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.

పెళ్లిచూపులు చిత్రానికి అక్కినేని అవార్డ్..!

విజయ్ దేవరకొండ-రీతువర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం పెళ్లిచూపులు.

ఓం నమో వేంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..!

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

'ఘాజి' రిలీజ్ డేట్

'బాహుబలి ది బిగినింగ్' సినిమాను దర్మేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ లో విడుదల చేసి తెలుగు సినిమా

స్టూడెంట్ నెం1 కు 15 ఏళ్లు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-దర్శకధీర రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన చిత్రం స్టూడెంట్ నెం1.