సాగర్ దర్శకత్వంలో నితీష్ రెడ్డి హీరోగా 'ప్రభాస్ ' చిత్రం ప్రారంభం.

  • IndiaGlitz, [Friday,September 22 2017]

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న"ప్రభాస్" చిత్రం 22 వ తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియో లో వైభవంగా ప్రారంభం అయ్యింది.

హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్ కి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా,మరో సీనియర్ నిర్మాత,తెలంగాణఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు.ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి
దర్శకత్వం వహించారు.

పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ...1983 లో రాకాసి లోయ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాను. మావారి గోల, స్టువర్టుపురం దొంగలు, అమ్మ దొంగ, అమ్మానా కోడలా వంటి డిఫరెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాను అన్నారు.

నిర్మాతలు అశోక్ , సతీష్ రెడ్డి మాట్లాడుతూ... ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నాం, తెలుగు , హిందీ, తమిళ,కన్నడ భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.

చిత్ర ప్రారంభానికి విచ్చేసిన చిత్ర రంగ ప్రముఖులకు దర్శక , నిర్మాతలు హీరో కృతజ్ఞతలు తెలిపారు

More News

'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదల

గుడ్ అంటే మంచి,బ్యాడ్ అంటే చెడు,అగ్లీ అంటే తింగరితనం అనే పదాలు మనకు తెలిసిందే.

'అదిరింది'.. క‌మ‌ల్ సినిమానా?

విజ‌య్ మూడు పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం మెర్స‌ల్‌.. తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎంత పని చేశావ్ సమంత...

చెన్నై సొగసరి సమంత మంచి నటి అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.

యువిక్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా 'హ్యాపీవెడ్డింగ్'

వ‌రుస‌  విజ‌యాలు సాధిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్‌'.

తార‌క్‌పై ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంస‌ల జ‌ల్లు

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం జై ల‌వ‌కుశ‌. నిన్న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయితే జై పాత్ర‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడంటూ అభిమానులు, ప్రేక్ష‌కులే కాకుండా విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసించారు.