ముంబైలో ప్ర‌భాస్ 'సాహో'

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి క్రేజ్ 'బాహుబ‌లి'తో అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాల గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ రెండు సినిమాల‌ను చేస్తున్నాడు. అందులో ముందుగా 'సాహో' సినిమా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజ‌ర్స్ సినిమా యాక్ష‌న్ జోన‌ర్‌లో మెప్పించ‌నుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశాయి.

'బాహుబ‌లి' త‌ర్వాత నేను చేస్తోన్న మ‌రో యాక్ష‌న్ మూవీ. ప్రేక్ష‌కులు కూడా నేను యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు' అని ప్ర‌భాస్ ఓ సంద‌ర్భంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా ముంబైలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌వుతుంది. సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీని త‌ర్వాత ప్ర‌భాస్ వెంట‌నే త‌న 20వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల‌వుతుంది.

More News

'ద‌బాంగ్ 3'లో అలీ

తెలుగులో స్టార్ కమెడియ‌న్ అలీ త్వర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ స్టార్ క‌మెడియ‌న్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అయితే ఆయ‌న రాజ‌కీయాలపైనే ఫోకస్డ్‌గా ఉన్నాడు.

పుట్టిన రోజు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేడు 69వ పడిలోకి అడుగుపెట్టారు. బాబు జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీలు

జనసేన-టీడీపీ చీకటి పొత్తులు జనాలకు తెలుసు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఎన్నికల ముందు వరకు ప్రచార సభల్లో.. పోలింగ్ తర్వాత నెట్టింట్లో యుద్ధం జరుగుతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సెవెన్'

ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే

ఆర్జీవీ.. 'టైగర్ కేసీఆర్' లో ఎవరెవరి పాత్రలుంటాయ్!?

టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏదైనా కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటిస్తే చాలు అది సంచలనమే.. వివాదాలకు ఇక కొదవుండదు!. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్