పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు

  • IndiaGlitz, [Monday,August 27 2018]

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్.. బాహుబ‌లి ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ మ‌రియు పాట‌లు లో మంచి విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. శోభ‌న్ గారు నా కెరీర్ కు వ‌ర్షం సినిమాతో తొలి విజ‌యాన్ని అందించారు.. అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజ‌యం అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. నా బిల్లా సినిమాకు ప‌ని చేసిన సౌంద‌ర్ రాజ‌న్ ఫోటోగ్ర‌ఫీ అద్బుతంగా ఉంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ ఈ చిత్ర హ‌క్కుల్ని కొన‌డం మ‌రో మంచి ప‌రిణామం. సంప‌త్ నంది గారికి అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఇతర నిర్మాత‌ల‌కు కూడా నా విషెస్ తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు.

ప్ర‌భాస్ వ‌చ్చి త‌మ చిత్రానికి విషెస్ తెల‌ప‌డంతో పేప‌ర్ బాయ్ చిత్ర‌యూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

న‌టీన‌టులు: సంతోశ్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

More News

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌వితేజ‌, ఇలియానా ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు.

వంద‌కోట్ల 'గీత గోవిందం'

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన త‌ర్వాత ఉన్న‌ట్లుండి సినిమా లీకైంది. నిర్మాత‌ల‌కు పైర‌సీ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం'

'@న‌ర్త‌న‌శాల‌' శాటిలైట్ హ‌క్కులు ఎవ‌రివంటే?

నాగ‌శౌర్య‌, కశ్మ‌రా ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన చిత్రం '@న‌ర్త‌న‌శాల‌'. ఆగ‌స్ట్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది.

రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను - ప్రియా వ‌డ్ల‌మాని

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం  'ప్రేమ రెయిన్ చెక్'.

ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయిన 'దిక్సూచి' హిందీ రైట్స్

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం,